News January 20, 2025
గాంధారిలో నకిలీ నోట్లు కలకలం

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఆదివారం భారీగా నకిలీ నోట్లు వెలుగు చూశాయి. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో కలకలం రేపింది. మండలంలోని చద్మల్ తండాలో లక్ష్మమ్మ ఆలయంలో ఏటా సంక్రాంతి సమయంలో జాతర సాగుతుంది. జాతరలో నకిలీ నోట్లు లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News February 28, 2026
కామారెడ్డి: శాంతి భద్రతల లోపం స్పష్టంగా కనిపిస్తోంది: ఏలేటి

కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కామారెడ్డిలో చోటుచేసుకున్న ఘటనలు, బాన్సువాడ, నాగర్ కర్నూల్‌లో భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే పట్టించుకోవడం లేదన్నారు. కామారెడ్డి ఘటనకు కారకులైన వారిని అరెస్టు చేయకుండా MLAపై దాడికి యత్నించిన వ్యక్తిని అడ్డుకున్న కార్యకర్తలను అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు.
News February 28, 2026
వచ్చే మూడేళ్లలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాజెక్టులు పూర్తి: సీఎం

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని పెండింగ్‌లో ఉన్న తాగునీటి ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రావివలస ప్రజా వేదికలో ఆయన మాట్లాడారు. పోలవరం నుంచి సుజల స్రవంతి ద్వారా విశాఖకి త్వరలోనే నీరు అందిస్తామన్నారు. వంశధార, నాగావళి, చంపావతి నదులను గోదావరితో అనుసంధానం చేస్తామన్నారు.
News February 28, 2026
నల్గొండ: నేడే ఆఖరు.. 2.42 లక్షల మంది పెండింగ్

జిల్లాలోని రైతులకు ప్రభుత్వం అందించే పథకాలు అందాలంటే తప్పనిసరిగా చేసుకోవాల్సిన ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ గడువు నేటితో ముగియనుంది. జిల్లా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు కేవలం 55.06 శాతం మంది రైతులు మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 5,39,619 మంది రైతులు ఉండగా, ఇంకా 2,42,492 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. మునుగోడు మండలంలో మాత్రమే అత్యధికంగా (70.22%) నమోదైంది.


