News January 23, 2025
గాంధారి: నిరుపేదలకు పథకాలు అమలులో ప్రాధాన్యత: కలెక్టర్

అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అమలులో ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం గాంధారి మండలం మాధవపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలు నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు తెలిపారు. నాలుగు పథకాలలో అర్హులైన ముసాయిదా జాబితాలను గ్రామసభలో చదివి వినిపించారు.
Similar News
News November 7, 2025
ఏటూరునాగారం ఫారెస్ట్‌లో సీతాకోక చిలుకల సర్వే

ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ అభయారణ్యం పరిసరాలలో సీతాకోకచిలుకలు, చిమ్మెటలపై సర్వే గురువారం ప్రారంభమైంది. అడవుల విస్తరణ, పునరుత్పత్తికి దోహదపడే వీటి సంతతి, మనుగడపై ఈ సర్వే ఈనెల 9 వరకు జరగనుంది. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వేను డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్ ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 33 మంది నిపుణులు పాల్గొంటున్నారు.
News November 7, 2025
Paytm నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్

పేటీఎం సంస్థ ‘చెక్-ఇన్’ పేరిట కొత్త AI ట్రావెల్ బుకింగ్ యాప్‌ను ప్రారంభించింది. బస్, మెట్రో, ట్రైన్స్, ఫ్లైట్స్‌కు సంబంధించిన వంటి టికెట్స్‌ను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ మేనేజ్మెంట్, పర్సనల్ ట్రావెల్ ప్లాన్స్, డెస్టినేషన్ రికమెండేషన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీంతో ప్రజలు మరింత స్మార్ట్‌గా, సులభంగా ట్రావెలింగ్ ప్లాన్ చేసుకోవచ్చని పేటీఎం ట్రావెల్ సీఈవో వికాస్ జలాన్ తెలిపారు.
News November 7, 2025
వనపర్తిలో నవంబర్ 10న అప్రెంటీషిప్ మేళా

వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నవంబర్ 10న అప్రెంటిషిప్ మేళా ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ కే.రమేష్ బాబు తెలిపారు. ఐటీఐ పాస్ అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభ్యర్ధులు అప్రెంటిస్ షిప్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేళాకు ధ్రువీకరణ పత్రాలతో రావాలన్నారు. వివరాలకు ట్రైనింగ్ ఆఫీసర్ ఎంఈ హక్‌ను లేదా సెల్ నంబర్లను 9849244030, 9490202037 సంప్రదించాలన్నారు.


