News February 24, 2025
గాంధారి: పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: నోడల్ అధికారి

ఈ నెల 5 నుంచి ప్రారంభమై ఇంటర్ పరీక్షకు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం సూచించారు. సోమవారం గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గంగారం, అధ్యాపకులు లక్ష్మణ్, విజయ్ కుమార్, సరిత, సుజాత, రమేశ్ పాల్గొన్నారు.
Similar News
News January 2, 2026
VZM: ఒక్కరోజే రూ.7.76 కోట్ల మద్యం ఫుల్‌గా తాగేశారు

విజయనగరం జిల్లాలో ఆబ్కారీ ఆదాయానికి 2026 సంవత్సరం ప్రారంభ రోజే కొత్త కిక్కునిచ్చింది. డిసెంబర్ 31న మందు బాబులు ఫుల్ జోష్ చేసుకున్నారు. ఏకంగా జిల్లాలో రూ.7.76 కోట్లు విలువ చేసే మద్యాన్ని తాగేశారు. గత ఏడాది రూ.5.27 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.2.50 కోట్ల ఆదాయం పెరిగింది. డిసెంబర్ 31న వైన్, బార్ అండ్ రెస్టారెంట్స్‌లో అమ్మకాలకు 2 గంటల వరకు అదనంగా అనుమతులు ఇచ్చారు.
News January 2, 2026
ప.గో: దైవదర్శనం ముగించుకుని వస్తుండగా.. లారీ రూపంలో మృత్యువు!

తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంగతి <<18732182>>తెలిసిందే<<>>. తణుకు మండలం వేల్పూరుకి చెందిన అందే లోకేశ్వరరావు, అందే వెంకటలక్ష్మి (48) దంపతులు ద్వారకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి దర్శనం ముగించుకుని బైకుపై వస్తుండగా.. తేతలి జాతీయ రహదారిపై లారీ ఢీకొట్టింది. కళ్లముందే భార్య మరణించడంతో భర్త రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 2, 2026
అనకాపల్లి: మహిళ ప్రాణం తీసిన కుంపటి

మంచం కింద పెట్టుకున్న కుంపటి ఓ మహిళ ప్రాణం తీసింది. ఈ విషాదకర ఘటన గురువారం రాత్రి అనకాపల్లి (D) కోటవురట్ల (M) కైలాసపట్నంలో జరిగింది. వంకల మాణిక్యం (74) పూరింట్లో ఉంటోంది. చలి ఎక్కువగా ఉండడంతో మంచం కింద కుంపటి పెట్టుకుని నిద్రపోయింది. కప్పుకున్న దుప్పటి కుంపటిలో పడి నిప్పు అంటుకుని పూరిళ్లు దగ్ధమైంది. ఈ సమయంలో వృద్ధురాలి ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది.


