News April 4, 2025
గాంధారి మండలంలో అదనపు కలెక్టర్ తనిఖీ

కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చందు నాయక్ గాంధారి మండలంలోని వివిధ గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు, రేషన్ షాపుల్లో సన్న బియ్యం పథకం, ఉపాధి పనులను లబ్ధిదారులకు అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాంధారి ఎంపీడీఓ రాజేశ్వర్, ఎంపీఓ లక్ష్మీనారాయణ, గ్రామ కార్యదర్శి ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 11, 2025
రాణా మావాడు కాదు: పాక్

26/11 ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి తహవూర్ రాణా తమ పౌరుడు కాదంటూ పాక్ పేర్కొంది. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గడచిన రెండు దశాబ్దాల్లో రాణా తన పాక్ పత్రాలను పునరుద్ధరించుకోలేదు. అతడు కెనడా జాతీయుడనేది సుస్పష్టం’ అని పేర్కొంది. మరోవైపు.. ముంబై ఉగ్రదాడుల్లో పాక్ నిఘా సంస్థ ISI పాత్ర ఉందన్న విషయం రాణాపై విచారణ అనంతరం బయటికొస్తుందని NIA వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
News April 11, 2025
MNCL: ఫూలే జయంతి ఉత్సవాలకు సింగేరేణి నిధులు

సింగరేణివ్యాప్తంగా శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి ఉత్సవాల నిర్వహణకు యాజమాన్యం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు సంస్థ సీఅండ్ఎండీ బలరామ్ ఆదేశాల మేరకు జీఎం (వెల్ఫేర్) పర్సనల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఫూలే జయంతి ఉత్సవాల నిర్వహణకు బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలకు రూ.25 వేలు, జైపూర్ లోని ఎస్టీపీపీకి రూ.15 వేలు చొప్పున నిధులు విడుదల చేశారు.
News April 11, 2025
KMR: చిన్నారి కిడ్నాప్.. క్షేమంగా తల్లికి అప్పగించిన పోలీసులు

నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో ఈనెల 7న రాత్రి కిడ్నాపైన బాలికను గురువారం క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మీర్జాపూర్‌కి చెందిన గైక్వాడ్ బాలాజీ.. బాలిక రమ్యను ఎత్తుకెళ్లాడు. మిర్జాపూర్‌లో తన స్నేహితుడైన సూర్యకాంత్ ద్వారా బాలికను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడని ఏసీపీ వివరించారు. సమావేశంలో SHO రఘుపతి పాల్గొన్నారు.