News January 25, 2025

గాంధారి: సింగర్ మంగ్లీ సందడి

image

గాంధారి మండలం చద్మల్ తండాలో శుక్రవారం సింగర్ మంగ్లీ సందడి చేశారు. మధుర లంబాడీల వేషధారణతో పాటను షూటింగ్ చేసేందుకు పరిసరాలను పరిశీలించినట్లు తండావాసులు తెలిపారు. తండాకు వచ్చిన సింగర్ మంగ్లీకి స్థానిక తండావాసులు మధుర లంబాడీల దుస్తులను ఆమెకు బహుకరించారు. మరో వారం రోజుల్లో షూటింగ్ నిర్వహించనున్నట్లు షూటింగ్ టీం సభ్యులు తెలిపినట్లు స్థానికులు వివరించారు.

Similar News

News November 13, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 3

image

13. భూమి కంటె భారమైనది? (జ.జనని)
14. ఆకాశం కంటె పొడవైనది? (జ.తండ్రి)
15. గాలి కంటె వేగమైనది? (జ.మనస్సు)
16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? (జ.ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో.. తాను ఇతరుల పట్ల అలా ప్రవర్తించకుండా ఉండనివారికి సజ్జనత్వం వస్తుంది.)
17. తృణం కంటె దట్టమైనది ఏది? (జ.చింత)
<<-se>>#YakshaPrashnalu<<>>

News November 13, 2025

విజయవాడలో దారుణ హత్య

image

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. విజయ టాకీస్ సమీపంలోని విన్స్ హాస్పిటల్లో పనిచేసే మహిళను ఆమె భర్త గురువారం మధ్యాహ్నం గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం భర్త సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ ఆలీ తెలిపారు.

News November 13, 2025

వరంగల్: మహిళల భద్రత కోసం షీ బాక్స్..!

image

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు వరంగల్ పోలీసు శాఖ మహిళలకు స్ఫూర్తిదాయక పిలుపునిచ్చింది. ఏ మహిళైనా పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురైతే లేదా అలాంటి ఘటనను గమనించినా, వెంటనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న SHe-Box వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు. సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని అధికారులు వివరించారు.