News November 21, 2025

గాంధీభవన్: ఓటర్ ఇన్‌ఫర్‌మేషన్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి: ఎమ్మెల్యే

image

ఓటర్ ఇన్‌ఫర్‌మేషన్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఓట్ చోర్ గద్దె చోడ్ సిగ్నేచర్ కమిటీకి తనను ఛైర్మన్‌గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. కమిటీ అంతా కలిసి పనులు విభజన చేసుకొని జిల్లా పర్యటనలు చేస్తామని చెప్పారు. డిజిటల్ ఓటర్ లిస్ట్ ఈసీ ప్రచురించాలని, అప్పుడే దొంగ ఓట్లు వేయడం ఆగుతుందన్నారు. ఓట్ చోరీకి బీజేపీ ఎలా పాల్పడుతుందో వివరిస్తామని వెల్లడించారు.

Similar News

News November 21, 2025

జగిత్యాల: వృద్ధుల ఫిర్యాదులకు కౌన్సిలింగ్

image

వృద్ధులపై నిరాదరణ చూపుతున్న కొడుకులు, కోడళ్లకు సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. తల్లిదండ్రులను పోషించకపోతే వయోవృద్ధుల ట్రిబ్యునల్ ద్వారా 6 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చని, వారి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్నా కలెక్టర్ తిరిగి తల్లిదండ్రుల పేరిట మార్చగలరని జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరిఅశోక్ కుమార్ హెచ్చరించారు. పలువురు ఒప్పంద పత్రాలు రాసిచ్చి పెద్దలను వెంట తీసుకెళ్లారు.

News November 21, 2025

వైష్ణవ క్షేత్రాలకు విజయనగరం నుంచి ప్రత్యేక సర్వీసులు

image

మార్గశిర, ధనుర్మాసం పుణ్యదినాలు పురస్కరించుకుని ప్రయాణికులు సౌకర్యార్థం విజయనగరం ఆర్టీసీ వారు ప్రముఖ వైష్ణవ క్షేత్రాలైన ద్వారకాతిరుమల, వాడపల్లి, అంతర్వేది, అప్పన్నపల్లి, అన్నవరం దర్శనానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. వివరాలకు డిపోలో సంప్రదించాలని కోరారు.

News November 21, 2025

TU: 5861 విద్యార్థుల హాజరు.. నలుగురు డిబార్

image

TU పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో నిజామాబాద్ లో ముగ్గురు, కామారెడ్డిలో ఒకరు డిబారయ్యారని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. 30 పరీక్ష కేంద్రాలలో 6131 మంది విద్యార్థులకు గాను 5861 మంది విద్యార్థులు హాజరు కాగా 266 మంది గైర్హాజరయ్యారు. COE సంపత్ తో కలిసి బోధన్, ఆర్మూర్, ధర్పల్లి, కామారెడ్డి పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.