News November 21, 2025

గాంధీభవన్: ఓటర్ ఇన్‌ఫర్‌మేషన్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి: ఎమ్మెల్యే

image

ఓటర్ ఇన్‌ఫర్‌మేషన్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఓట్ చోర్ గద్దె చోడ్ సిగ్నేచర్ కమిటీకి తనను ఛైర్మన్‌గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. కమిటీ అంతా కలిసి పనులు విభజన చేసుకొని జిల్లా పర్యటనలు చేస్తామని చెప్పారు. డిజిటల్ ఓటర్ లిస్ట్ ఈసీ ప్రచురించాలని, అప్పుడే దొంగ ఓట్లు వేయడం ఆగుతుందన్నారు. ఓట్ చోరీకి బీజేపీ ఎలా పాల్పడుతుందో వివరిస్తామని వెల్లడించారు.

Similar News

News November 21, 2025

చౌడేపల్లె: నీటిలో దూకి తల్లీబిడ్డ ఆత్మహత్య

image

చిత్తూరు(D) చౌడేపల్లె మండలంలో విషాదం నెలకొంది. వెంగళపల్లికి చెందిన ఆదిలక్ష్మికి 8నెలల కుమార్తె ఉంది. చిన్నారి హార్ట్‌కు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. హైదరాబాద్‌తో పాటు చాలాచోట్ల చికిత్స అందించారు. పాప ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆ తల్లి మనస్తాపానికి గురైంది. బిడ్డతో కలిసి ఆదిలక్ష్మి గ్రామ సమీపంలోని చెక్ డ్యాం‌లో శుక్రవారం దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లీబిడ్డ మృతదేహాలను చూసి గ్రామస్థులు విలపించారు.

News November 21, 2025

ఇద్దరు హోంగార్డుల మధ్య గొడవ.. సీరియస్ యాక్షన్ తీసుకున్న ప్రకాశం ఎస్పీ!

image

క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ ఇద్దరు హోంగార్డులను విధుల నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దారవీడుకు చెందిన హోంగార్డ్ యాసిన్, దోర్నాలకు చెందిన ప్రశాంత్ కుమార్, వెలిగండ్లకు చెందిన బాలసుబ్రమణ్యం విధుల నిమిత్తం 19న ఒంగోలుకు వచ్చి విశ్రాంతి కోసం గదిని తీసుకున్నారు. ప్రశాంత్, సుబ్రహ్మణ్యం గొడవ పడగా, ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.

News November 21, 2025

NGKL: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశం కల్పించాలి: ఎంపీ

image

పార్లమెంటు పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గ్రామీణ బ్యాంకు అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. యువత ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకు రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని కోరారు.