News August 30, 2025

గాంధీలో 24 గంటలుగా నో వాటర్

image

రాష్ట్రంలోనే ఘనత వహించిన గాంధీ ఆస్పత్రిలో గత 24 గంటలుగా నీరు లేక అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న రాత్రి గాంధీ పంప్ హౌస్‌లోని పంపుసెట్లు మోరాయించడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. అటు తాగునీటికి ఇటు కాలకృత్యాలకు నీరు లేక ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్‌లోని పేషెంట్లు వారి సహాయకులు, నర్సింగ్ సిబ్బంది నరకయాతన అనుభవించారు. పలు ఆపరేషన్లు నిలిచిపోయాయి. కాసేపటి క్రితం నీటి సరఫరాను పునరుద్ధరించారు.

Similar News

News August 30, 2025

HYD: సర్కారు స్కూళ్లలో LKG, UKG

image

LKG, UKG క్లాసులు ప్రైవేట్ స్కూళ్లల్లోనే కాదు సర్కారు బడుల్లోనూ స్టార్ట్ కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి యూకేజీ నిర్వహించాలని నిర్ణయించింది. మహానగర వ్యాప్తంగా ఎంపిక చేసిన 114 స్కూళ్లల్లో ఈ అడ్మిషన్లు ఇస్తారు. గ్రేటర్‌ పరిధిలో 25, మేడ్చల్ పరిధిలో 24, రంగారెడ్డి పరిధిలో 65 పాఠశాలలను ఎంపిక చేశారు. దీనిపై మీ కామెంట్?

News August 29, 2025

HYDలోని డిఫెన్స్ ల్యాండ్స్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో గుర్తించిన డిఫెన్స్ ల్యాండ్స్‌కు సంబంధించిన నివేదికలను వారంలో అందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్వాన్ MLA కౌసర్ మోహియుద్దీన్,
నాంపల్లి MLA మాజీద్ హుస్సేన్, MLC మీర్జా రహమత్ బేగ్‌తో కలసి ఆసిఫ్‌నగర్, గోల్కొండ, నాంపల్లి, షేక్‌పేట్‌లో గుర్తించిన డిఫెన్స్ భూములపై సమీక్షించారు.

News August 29, 2025

HYD: గంగ ఒడి.. కంట తడి

image

వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు సందడి నెలకొంది. భక్తులు తమ నివాసాలు, వీధుల్లో ప్రతిష్ఠించిన చిన్న విగ్రహాలను చెరువుల వద్దకు తీసుకొస్తున్నారు. ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్‌ చెరువు, మీర్‌పేట మంత్రాల చెరువు, సఫీల్‌గూడ మినీ ట్యాంక్‌బండ్ వద్ద కోలాహలం నెలకొంది. గుండె నిండా భక్తితో మళ్లీ రావయ్య గణపయ్య అంటూ సాగనంపుతున్నారు. గంగ ఒడికి గణపయ్య చేరుతోన్న సమయంలో భక్తుల భావోద్వేగం కంట తడి తెప్పిస్తోంది.