News September 12, 2025
గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ వాణి

గాంధీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా అడిషనల్ డీఎంఈ డాక్టర్ వాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్ రాజకుమారిని ఫిజియాలజీ ప్రొఫెసర్‌గా బదిలీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది నుంచి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Similar News
News September 12, 2025
JNTUH: బీటెక్ సెకెండ్ సెమిస్టర్ రిజల్ట్స్

బీటెక్ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను వర్సిటీ అధికారులు రిలీజ్ చేశారు. ఈ ఫలితాల్లో విద్యార్థులు తక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కేవలం 42.38 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు వర్సిటీ వెబ్ సైట్‌లో ఉన్నాయని ఎగ్జామినేషన్ డైరెక్టర్ క్రిష్ణమోహన్ రావు తెలిపారు.
News September 12, 2025
కూకట్‌పల్లిలో వ్యభిచారం.. ఐదుగురి అరెస్ట్

కూకట్‌పల్లిలోని 15వ ఫేజ్‌లో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న వ్యభిచార కేంద్రాన్ని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అధికారులు బట్టబయలు చేశారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నిర్వాహకురాలితో పాటు నలుగురు యువతులు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News September 12, 2025
కూకట్‌పల్లిలో రేపు జాబ్ మేళా

ఐటీ, డీపీఓ ఉద్యోగాలకు సంబంధించి రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి కిషన్ తెలిపారు. కూకట్‌పల్లి ప్రభుత్వ కళాశాలలో ఈ మేళా ఉంటుందన్నారు. ఇంటర్ మీడియట్‌లో 75 శాతం ఉత్తీర్ణత సాధించిన వారు ఈ మేళాకు హాజరు కావొచ్చన్నారు. అభ్యర్థులు ఫొటోలు, సర్టిఫికెట్లు తమ వెంట కచ్చితంగా తీసుకురావాలన్నారు. వివరాలకు 76740 07616, 79818 34205 నంబర్లను సంప్రదించాలన్నారు.