News July 22, 2024
గాంధీ ఆస్పత్రిలో భారీగా బదిలీలు.. పేషంట్లపై ఎఫెక్ట్..!
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నుంచి ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది బదిలీ కావడంతో పేషంట్లకు అందించే వైద్య సేవలు, మెడికల్ స్టూడెంట్లపై ప్రభావం పడనుందని పలువురు భావిస్తున్నారు. 42మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, తదితర డిపార్ట్‌మెంట్ల వైద్య సిబ్బందితో పాటు 23మంది నాన్ మెడికల్ సిబ్బంది ట్రాన్స్ఫర్ అయినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News January 18, 2025
RR: రైతు భరోసా.. ఈ సారి ఎంత మందికో!
ఉమ్మడి RR జిల్లాలో 6.3 లక్షల మంది రైతులు ఉండగా, గత చివరి సీజన్లో RR జిల్లా పరిధిలో 3.04 లక్షల మంది రైతులకు రూ.343.97 కోట్లు రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో జమ చేశారు. వికారాబాద్ జిల్లాలో 2.70 లక్షలమంది రైతులకు రూ.319.36కోట్లు పంపిణీ చేశారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 44,792 మంది రైతులకు రూ.39.74కోట్లు రైతులఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం రైతుభరోసాకు సంబంధించి సర్వే జరుగుతోంది.
News January 18, 2025
RR: రైతు భరోసా సర్వే.. టార్గెట్-20
RR, MDCL, VKB జిల్లాల వ్యాప్తంగా రైతు భరోసా పథకం అమలు చేసేందుకు ప్రభుత్వ వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామ గ్రామాల్లో తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. జనవరి 20 తేదీ నాటికి సర్వేను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారులను సైతం కలిసి వివరాలు సేకరిస్తున్నారు.
News January 18, 2025
త్వరలో చేవెళ్లకు ఉప ఎన్నిక: KTR
త్వరలో చేవెళ్ల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. చేవెళ్లతో పాటుగా పార్టీ మారిన 10 ఎమ్మెల్యేల స్థానాల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతాయని, ప్రజలందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలయ్యేంత వరకు BRS పార్టీ నిర్విరామంగా పోరాడుతుందని KTR అన్నారు. కాగా, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య BRS నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన సంగతి తెలిసిందే.