News September 16, 2024

‘గాంధీ భవన్‌తో 40ఏళ్ల అనుభవం ఉంది’

image

గాంధీభవన్‌తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని నూతన TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్‌లో 1985లో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా తన ప్రస్థానం ప్రారంభమైందని తెలిపారు. కౌశిక్‌రెడ్డి వాడిన భాష వల్లే అరెకపూడి గాంధీ అనుచరులు నొచ్చుకున్నారని, బూతులు తిట్టుకోవడం TG రాజకీయాల్లో గతంలో లేదని ఆయన పేర్కొన్నారు. పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని తనకు పదవితో నిరూపితమైందని వెల్లడించారు.

Similar News

News October 4, 2024

NZB: నేడు నగరానికి రానున్న TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

image

నూతన TPCC అధ్యక్షునిగా నియమింపబడిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం మొదటిసారి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ సభలో పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.

News October 4, 2024

NZB: రీజియన్‌కు చేరిన 13 ఎలక్ట్రిక్ బస్సులు

image

నిజామాబాద్ రీజియన్‌కు మొదటి విడతగా 13 ఎలక్ట్రిక్ బస్సులు చేరుకున్నాయి. వీటిని శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారభించనున్నట్లు RM జానిరెడ్డి తెలిపారు. ముందుగా ఈ బస్సులను జేబీఎస్ రూట్లలో నడుపనున్నామని, ప్రత్యేకమైన సౌకర్యాలు గల ఈ బస్సుల్లో పెద్దలకు రూ.360, పిల్లలకు రూ.230 చార్జీ ఉంటుందని RM వివరించారు.

News October 4, 2024

NZB: ‘సన్నాలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి’

image

సన్నాలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. వచ్చే జనవరి మాసం నుంచి రాష్ట్ర ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందించనున్న దృష్ట్యా, రైతులు సన్న రకాలకు చెందిన వరి ధాన్యం పండించేలా ప్రోత్సహించాలని సూచించారు.