News August 14, 2025
గాంధీ భవన్‌లో ‘రాజీవ్ జ్యోతి’కి ఘన స్వాగతం

ఏటా పెరంబదూర్ నుంచి ఆగస్టు 20 రాజీవ్ గాంధీ జయంతి నాటికి ఢిల్లీకి చేరుకునేలా చేపట్టే రాజీవ్ జ్యోతి యాత్ర ఈ రోజు HYDకు చేరుకుంది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచన మేరకు యాత్రకు గాంధీ భవన్‌లో స్వాగతం పలికారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్, ఉపాధ్యక్షుడు కుమార్‌రావ్, నాంపల్లి ఇన్‌ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్ ఉన్నారు.
Similar News
News August 14, 2025
HYD: అలాంటి లక్షణాలు కనిపిస్తే.. హాస్పిటల్ వెళ్లండి.!

మత్తుకు బానిసవుతున్న యువత ఆరోగ్యం క్షేనిస్తోంది. జ్ఞాపకశక్తి మందగించడం, కళ్లు ఎరుపెక్కటం, పెదాలు పొడి బారిపోవడం, ఒంటరిగా బతకటం, మానసిక ఒత్తిడిని గమనించటం, ఆకలి తగ్గిపోవడం, అంతకు ముందులా నిద్ర లేకపోవడం, నిద్రకు దూరం అవటం లాంటివి గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని HYD ఎర్రగడ్డ మానసిక వైద్య ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
News August 14, 2025
పెద్దమ్మగుడి కూల్చివేతపై హైకోర్టులో లంచ్ మోషన్

పెద్దమ్మగుడి కూల్చివేతపై హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు అయ్యింది. అక్రమంగా కూల్చిన ఆలయాన్ని మళ్లీ నిర్మించాలని న్యాయవాది పల్లె వినోద్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో హైకోర్టులో పెద్దమ్మ గుడి కూల్చివేతపై విచారణ జరగనుంది. గుడి కూల్చివేత కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పిటీషన్‌లో పేర్కొన్నారు.
News August 14, 2025
HYD: ప్రాణాలు పోతేనే స్పందిస్తారా..?

సికింద్రాబాద్ కార్ఖానా ట్రాఫిక్ PS పక్కనే మెయిన్ రోడ్డుపై భారీ గుంత ప్రమాదకరంగా మారింది. ఈ గుంత ఏర్పడి ఏడాది దాటిందని, ఇప్పటి వరకు అధికారులు మరమ్మతులు చేయలేదని, ప్రాణాలు పోతేనే స్పందిస్తారా అంటూ వాహనదారులు మండిపడుతున్నారు. బుధవారం రాత్రి ఓ కారు వేగంగా వచ్చి గుంతను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో వెనకాల వచ్చిన బైక్ నడిపే వ్యక్తి కారును ఢీకొట్టి గాయపడ్డాడు. మీ ప్రాంతంలో ఇలాంటి గుంతలు ఉంటే కామెంట్ చేయండి.