News March 5, 2025
గాజువాకలో భారీ చోరీ

గాజువాక సమీపంలో గల కాపు జగ్గరాజుపేట STBL వసుంధర గార్డెన్స్‌లో చోరీ జరిగింది. ఉమ అనే మహిళ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వసుంధర గార్డెన్స్‌లో నివాసం ఉంటున్న ఉమ తన తల్లిని చూసేందుకు వెళ్లి రాత్రి అక్కడే ఉండిపోయింది. బుధవారం ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగులకొట్టి ఉన్నాయని, సుమారు 75 తులాలు బంగారం చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 6, 2025
విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీలకు ఇంటర్ పరీక్షలు

విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీలకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి పది మంది ఖైదీలు రెగ్యులర్ గాను, మరో ఐదుగురు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వీరిలో నలుగురు ఖైదీలు రాజమండ్రి జైలుకు ట్రాన్స్‌ఫర్ కాగా మిగిలినవారు పరీక్షలు రాస్తున్నారు. వీరికి జైలు ప్రాంగణంలో ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేసి పరిశీలకులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జైలు సూపరిండెండెంట్ మహేశ్ బాబు తెలిపారు.
News March 6, 2025
విశాఖ – బరంపూర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

విశాఖ నుంచి బరంపూర్ వెళ్లే విశాఖ – బరంపూర్ ఎక్స్‌ప్రెస్ (18526/25) మూడు రోజులపాటు రద్దు చేసినట్టు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ బుధవారం తెలిపారు. కుర్దా డివిజన్‌లో ఆపరేషనల్ పనులు నిమిత్తం రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. మార్చ్ 6,7వ తేదీలో విశాఖ నుంచి బరంపూర్ వెళ్లే రైలు, మార్చి 7,8 తేదీల్లో బరంపూర్ నుంచి విశాఖ వచ్చే రైలు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News March 6, 2025
విశాఖపట్నంలో టుడే టాప్ న్యూస్

➤ చిన్న వయసులోనే 175 సర్టిఫికెట్ కోర్సులు➤ విశాఖ చేరుకున్న కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ➤ విశాఖలో రేపే మద్యం దుకాణాల వేలం➤ తాటిచెట్లపాలెం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి➤ సింహాచలం దేవస్థానం హుండీ ఆదాయం రూ.1,85,22,270 ➤ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదిక చర్యలు ➤విశాఖలో 29.2 కిలో మీటర్ల మేర ఇంటర్నల్ రోడ్లు నిర్మాణం