News April 15, 2024
గాజువాకలో 108 సూపర్వైజర్ ఆత్మహత్య

అల్లూరి జిల్లా పాడేరు 108 సూపర్వైజర్ ఇబ్రహీం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విధుల్లో ఉన్న సూపర్వైజర్ తన కుటుంబ సభ్యులను కలిసేందుకు గాజువాక వెళ్లారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదంతో ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించిగా.. అప్పటికే మృతి చెందాడు. 108 సిబ్బంది, ఉద్యోగులతో ఎంతో సఖ్యతగా ఉండే వ్యక్తి మృతి చెందడంతో తోటి సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. మృతుడికి భార్య, పాప ఉన్నారు.
Similar News
News October 7, 2025
వాల్మీకి జీవిత విశేషాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి: కలెక్టర్

మహర్షి వాల్మీకి జీవిత విశేషాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకొని విశాఖ జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మానవ జీవితానికి అనువైన విధంగా వాల్మీకి రామాయణాన్ని రచించి ఎన్నో విషయాలపై మహత్తర సందేశాన్ని అందించారని గుర్తు చేశారు.
News October 7, 2025
విశాఖలో ప్రారంభమైన రక్త మార్పిడి సేవలపై జాతీయ వర్క్‌షాప్

ఏపీ రక్త మార్పిడి సేవల విభాగం, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో “రక్తం,రక్త ఉత్పత్తుల హేతుబద్ధ వినియోగం” అంశంపై రెండు రోజుల జాతీయ వర్క్‌షాప్ విశాఖలో మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జెనరల్ డా.సునీత శర్మ, NBTC డైరెక్టర్ డా.కృష్ణ కుమార్, WHO ప్రతినిధి డా.మాధుర్ గుప్తా పాల్గొన్నారు.
News October 7, 2025
రుస్తోంజీ గ్రూప్ ఛైర్మన్ బొమన్ ఇరానీతో నారా లోకేష్ భేటీ

రుస్తోంజీ గ్రూప్ ఛైర్మన్ బొమన్ ఇరానీతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలో భేటీ అయ్యారు. ఐటీ కంపెనీలు, డేటా సెంటర్ల రాకతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మహా నగరంలో లగ్జరీ టౌన్ షిప్ నిర్మాణం చేపట్టాలని మంత్రి లోకేష్ ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బాగస్వామ్యం అవ్వాలని కోరారు.