News December 29, 2025
గాజువాక: ఉరి వేసుకుని బాలుడి ఆత్మహత్య

గాజువాక డిపో 59 వార్డు నక్కవానిపాలెంలో ఓ బాలుడు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో యుగంధర్ వర్మ (16) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. బాలుడి అత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 1, 2026
జీవన్‌దాన్ ద్వారా వారి జీవితంలో కొత్త వెలుగులు

రాష్ట్ర వైద్యరంగంలో మరో సరికొత్త రికార్డు నమోదయింది. 301 మందికి జీవన్‌దాన్ (అవయవ దానం) ద్వారా జీవితాల్లో వెలుగులు నింపారు. 2015 నుంచి ఇప్పటివరకు 1293 అవయవాలను సేకరించి అవసరమైన రోగులకు అందించామని విమ్స్ డైరెక్టర్ జీవన్‌దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కే.రాంబాబు తెలిపారు. జీవన్‌దాన్ చేస్తున్న సేవలను రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ అభినందించారు.
News January 1, 2026
విశాఖలో కూటమి నేతల ఐక్యత స్వరం

స్టీల్ ప్లాంట్, విశాఖ భూముల అంశాలు, తదితర సమస్యలపై YCP, వామపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు సమాధానం చెప్పే విషయంలో విశాఖ MP, MLAలు ఒక్కో విధంగా స్పందిస్తున్నారనే విమర్శలు వినిపించాయి. దీంతో వీరి మధ్య సరైన సమన్వయం లేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయన్న వాదనలున్నాయి. అయితే అనూహ్యంగా బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ‘మేమంతా కలిసే ఉన్నాం’ అని సంకేతాలిచ్చారు.
News January 1, 2026
విశాఖ జిల్లా అధికారులకు కలెక్టర్ సూచన

న్యూఇయర్ వేడుకల వేళ విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సరికొత్త ఆలోచన చేశారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని అధికారులు, సిబ్బంది పూల బొకేలు, స్వీట్లు కాకుండా పేదలకు, అనారోగ్య బాధితులకు ఉపయోగపడే విధంగా నెలకొల్పిన సంజీవని నిధికి విరాళాలు అందించాలని ఆయన సూచించారు. కలెక్టర్ తన కార్యాలయంలో గురువారం ఉదయం 9.30 నుంచి అందుబాటులో ఉంటారు.


