News April 25, 2024

గాజువాక టీడీపీ అభ్యర్థిపై మూడు కేసులు

image

గాజువాక TDP అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచారు. పల్లా కుటుంబ ఉమ్మడి ఆస్తుల విలువ రూ.34.32 కోట్లు. వాటిలో శ్రీనివాసరావు పేరిట స్థిరాస్తులు రూ.7.13కోట్లు,చరాస్తులు రూ.14.91 లక్షలు. ఆయన భార్య లావణ్యదేవి పేరిట స్థిరాస్తులు రూ.6.59 కోట్లు, చరాస్తులు రూ.61,34 లక్షలు. అవిభక్త కుటుంబానికి రూ.20.26 కోట్లున్నాయి. అప్పులు రూ.2.33 కోట్లు. ఆయనపై మూడు కేసులున్నాయి.

Similar News

News September 30, 2024

విశాఖ కానిస్టేబుల్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్

image

ఎండాడ మహిళా పోలీసు స్టేషన్‌ కానిస్టేబుల్ కనకల వెంకట నరసింహమూర్తి ఈనెల 22న విధులకు వెళ్లారు. డ్యూటీ అనంతరం నరసింహమూర్తి ఇంటికి రాలేదు. అతని భార్య ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో స్టేషన్లో ఆరా తీసి మిస్సింగ్ కేసు పెట్టింది. అయితే ఆదివారం నరసింహమూర్తి ఇంటికి చేరుకున్నాడు. ఆ సంగతి తెలుసుకున్న SI వెళ్లి ఆరా తీయగా పనిఒత్తిడితో ప్రశాంతత కోసం తిరుపతి, విజయవాడ దైవ దర్శనానికి వెళ్లినట్లు అతను తెలిపాడు.

News September 30, 2024

విశాఖ: ‘ఓటుహక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి’

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నోటిఫికేషన్ వెలువడిందన్నారు. ఓటు నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైందని నవంబర్ 6 వరకు కొనసాగుతుందన్నారు. నవంబర్ 23న డ్రాఫ్ట్ పబ్లిష్ అవుతుందన్నారు. 23 నుంచి డిసెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ, 30న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. >Share it

News September 30, 2024

విశాఖ కేజీహెచ్ నుంచి విద్యార్థి పరారీ..!

image

డౌనూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థి కే.సురేష్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు కొయ్యూరు ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ చొరవ తీసుకుని కేజీహెచ్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే విద్యార్థి సోమవారం ఆసుపత్రి నుంచి పరారయ్యాడని ఏటీడబ్ల్యూవో తెలిపారు. నాటువైద్యం చేయించడానికి తల్లిదండ్రులు స్వగ్రామమైన కుడిసింగి తీసుకెళ్లి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.