News March 27, 2024

గాజువాక: నేలబావిలో సెక్యూరిటీ గార్డు మృతదేహం

image

గాజువాక ఆటోనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆటోనగర్ ఎస్ బ్లాక్‌లో టీపీఎల్ ప్లాస్టిక్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ గణేష్ (31) నేలబావిలో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందాడు. ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 8, 2025

జాతీయస్థాయి అథ్లెటిక్స్‌లో విశాఖ క్రీడాకారులకు పతకాలు

image

రాజస్థాన్‌లో జరుగుతున్న 44వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో విశాఖ నుంచి 33 క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 5 స్వర్ణ, 7రజత, 10 కాంస్య పతకాలను సాధించి విజేతలుగా నిలిచారు. వీరికి శుక్రవారం పలువురు అభినందనలు తెలిపారు. విశాఖ అథ్లెట్స్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు.

News February 7, 2025

ఎమ్మెల్సీ ఎన్నిక ప్ర‌క్రియ‌లో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాలి: కలెక్టర్

image

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్ర‌క్రియ‌లో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాలని అధికారుల‌ను విశాఖ క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో అధికారులతో స‌మావేశ‌మ‌య్యారు. నామినేష‌న్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వ‌సతుల క‌ల్ప‌న‌, జాబితాల త‌యారీ, సిబ్బంది కేటాయింపు అంశాల‌పై దిశానిర్దేశం చేశారు. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌న్నారు.

News February 7, 2025

విశాఖ మీదుగా వెళ్లే యశ్వంత్పూర్ రైలు రద్దు

image

టాటా నగర్ నుంచి విశాఖ మీదగా యశ్వంత్పూర్ వెళ్లే రైలును(18111/12) ఫిబ్రవరి 6,13 తేదీలలో రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఖమ్మం డివిజన్‌లో ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టడం వలన రైలును రద్దు చేసినట్లు తెలిపారు. యశ్వంత్పూర్ నుంచి విశాఖ మీదగా టాటానగర్ వెళ్లే రైలు కూడా ఫిబ్రవరి 6,13 తేదీలలో రద్దు చేశామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

error: Content is protected !!