News March 7, 2025
గాజువాక: రోడ్డు ప్రమాదంలో సచివాలయం ఉద్యోగి మృతి

సచివాలయ ఉద్యోగి డాక్ యార్డ్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కూర్మన్నపాలెం సచివాలయం-1 మహిళా పోలీస్‌గా పనిచేస్తున్న మీను స్కూటీపై తన కుమార్తెతో నగరానికి వెళ్లి తిరిగి వస్తుండగా మారుతి సర్కిల్ సమీపంలో లారీని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కుమార్తె గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 9, 2025
విశాఖలో 142 కేసులు పరిష్కారం

విశాఖ జిల్లా కోర్ట్‌లో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్ ద్వారా 142 కేసులు పరిష్కారం చేసి బాధితులకు రూ.11.76 కోట్ల నష్ట పరిహారం చెల్లించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అలపాటి గిరిధర్ పేర్కొన్నారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్నదే న్యాయ వ్యవస్థ అంతిమ లక్ష్యమన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.వి.శేషమ్మ, మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి వెంకటరమణ ఉన్నారు.
News March 9, 2025
స్టీల్ ప్లాంట్‌లో 900 మంది కార్మికులు తొలగింపు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. ఇప్పటికే అఖిలపక్ష కార్మిక సంఘాలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీసులు ఇచ్చారు. అయితే మరో పక్కన స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్‌కు యాజమాన్యం షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని అణగదొక్కేందుకు కార్మిక సంఘాల ప్రతినిధులపై ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
News March 9, 2025
విశాఖ: ఇన్‌ఛార్జ్ మంత్రితో సమావేశమైన జిల్లా కలెక్టర్, సీపీ

విశాఖలో శనివారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని పోర్ట్ గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, విశాఖ సీపీ శంఖ బ్రాత బాగ్చి కలిశారు. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు గూర్చి మంత్రి అడిగి తెలుసుకున్నారు. P4 సర్వే సమర్థవంతంగా జరిగేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.