News July 30, 2024
గాయత్రి షుగర్స్ పై విచారణ చేపట్టండి : MLA తోట

రైతుల పేరిట రూ.9 కోట్ల ఋణాలు తీసుకున్న నిజాంసాగర్లోని గాయత్రి షుగర్స్ పై విచారణ చేపట్టాలని జుక్కల్ MLA తోట లక్ష్మి కాంత్ రావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేఖ రాశారు. సంస్థ సొంత వ్యాపారాల కోసం 1030 మంది అమాయక రైతులను మోసం చేసి రూ.9 కోట్ల ఋణం పొందింది. రైతుల హక్కులను పరిరక్షించేలా ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు చేయించాలని లేఖ ద్వారా మంత్రికి విన్నవించారు.
Similar News
News September 19, 2025
NZB: 250కిపైగా పిల్లలున్నా.. లేని ప్రభుత్వ టీచర్..!

రుద్రూర్ మండలం సులేమాన్ నగర్‌లోని MPPS ఉర్దూ మీడియం HM అఫ్సర్ మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన సందర్భంగా ఆయన్ను గురువారం మాజీ MPTC గౌస్, స్కూల్ సిబ్బంది, గ్రామస్థులు సన్మానించారు. అయితే ఈ స్కూల్లో 250కిపైగా విద్యార్థులున్నా వీరికి గణితం, తెలుగు బోధించేందుకు టీచరే లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో పిలలకు నష్టం జరగకుండా గౌస్ 2024 నుంచి నెలకు రూ.3,000 జీతం ఇస్తూ ఓ మహిళా టీచర్‌తో చదువు చెప్పిస్తున్నారు.
News September 18, 2025
NZB: పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి: CP

పెండింగ్ కేసులు త్వరగా క్లియర్ చేయాలని నిజామాబాద్ CP సాయి చైతన్య ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహణ పెంచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
News September 18, 2025
NZB: ఎస్ఆర్ఎస్పీ కాలువలో వృద్ధురాలి శవం

ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకువచ్చిన ఓ వృద్ధురాలి శవాన్ని జగిత్యాల(D) మల్యాల(M) నూకపల్లి బ్రిడ్జి వద్ద స్థానికులు గుర్తించారు. శవం ముందుకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి ఉంచారు. ఆమె నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గ్రామానికి చెందిన ప్రభావతిగా గుర్తించారు. ఆమెకు మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.