News March 23, 2025
గాయపడ్డ కానిస్టేబుల్‌ను పరామర్శించిన కేటీఆర్

కరీంనగర్లో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నగరంలో ర్యాలీలో నిర్వహించారు. ఈ ర్యాలీలో ఓ మహిళా కానిస్టేబుల్ గాయపడ్డ విషయం తెలిసిందే. గాయపడ్డ పద్మజాను కేటీఆర్ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ర్యాలీలో బైక్ వేగంగా రావడంతోనే గాయపడినట్టు మహిళా కానిస్టేబుల్ కేటీఆర్‌కు వివరించారు.
Similar News
News January 1, 2026
KNR -1 డిపో ఆవరణలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ప్రారంభం

KNR రీజియన్ డిప్యూటీ RM ఎస్.భూపతిరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026 కార్యక్రమ ప్రారంభ వేడుక KNR 1 డిపో ఆవరణలో ప్రారంభమైంది. డిప్యూటీ RM మాట్లాడుతూ.. రీజియన్‌లో ప్రమాద రహిత సర్వీసు గల డ్రైవర్లు చాలా మంది ఉన్నారన్నారు. వారిని ఇతరులు ఆదర్శంగా తీసుకొని రీజియన్‌లో జీరో ఆక్సిడెంట్ రీజియన్ ఘనత సాధించుటకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి బి.శ్రీకాంత్ చారి ఉన్నారు.
News December 31, 2025
KNR: న్యూఇయర్ సెలబ్రేషన్లో నిబంధనలు కఠినం

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సీపీ గౌష్ ఆలం ఆంక్షలు విధించారు. బుధవారం రాత్రి 8 నుంచి గురువారం ఉదయం 8 వరకు 163 బీఎన్ఎస్ఎస్ చట్టం అమలులో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలోకి భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. డీజేలు, బాణసంచా వాడకూడదని, డ్రంకెన్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్‌పై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
News December 31, 2025
జమ్మికుంట: నిలకడగానే పత్తి గరిష్ఠ ధర

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ఠ ధర నిలకడగానే ఉంది. బుధవారం యార్డుకు 23 వాహనాల్లో 203 క్వింటాళ్ల విడి పత్తిని రైతులు తీసుకొని రాగా.. గరిష్ఠంగా క్వింటాకు రూ.7,400, కనిష్ఠంగా రూ.6,900లకు ప్రైవేట్ వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేశారు. మార్కెట్ కార్యకలాపాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు.


