News January 5, 2026
గార్డెన్‌లో మొక్కలకు చీడలు తగ్గాలంటే..

చలికాలంలో సరైన ఎండ లేకపోవడం, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలకు చీడలు ఎక్కువగా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే నాలుగు చెంచాల వంటసోడా, ఎక్కువ గాఢతలేని సోప్ పౌడర్ ఓ చెంచా తీసుకుని అయిదులీటర్ల నీటిలో వేసి కరిగించాలి. ఈ మిశ్రమాన్ని మొక్కలపై చల్లితే తిరిగి ఆరోగ్యంగా ఎదుగుతుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్‌ను నాలుగు లీటర్ల నీటిలో కలిపి చల్లితే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి.
Similar News
News January 6, 2026
అమెరికాలో పుట్టి.. HYDకు ఆడుతున్నాడు

VHTలో డబుల్ సెంచరీ బాదిన <<18778738>>అమన్ <<>>రావు అమెరికాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కరీంనగర్‌కు చెందినవారు కాగా ఉద్యోగ నిమిత్తం USకు వెళ్లారు. HYDలో పెరిగిన అమన్ క్రికెట్‌పై మక్కువ పెంచుకొని దేశవాళీలో సత్తా చాటుతున్నారు. VHTలో హైదరాబాద్ తరఫున డబుల్ సెంచరీ బాదిన తొలి, ఓవరాల్‌గా తొమ్మిదో ప్లేయర్. ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. IPL-2026 మినీ వేలంలో అమన్‌ను RR ₹30Lakhsకు కొనుగోలు చేసింది.
News January 6, 2026
డబ్బులివ్వకుంటే సిబ్బందికి జీతాలెలా: KRMB

AP, TG ప్రభుత్వాల తీరుపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB) అసంతృప్తి వ్యక్తం చేసింది. గత 3 త్రైమాసికాలుగా బోర్డుకు నిధులు విడుదల చేయకపోవడంపై ఆగ్రహించింది. FY25-26లో ఎలాంటి నిధులూ ఇవ్వకపోవడంపై 2 రాష్ట్రాల ఇరిగేషన్ ENCలకు లేఖ రాసింది. సిబ్బందికి జీతాలు చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. కాగా టెలిమెట్రీ ఫేజ్2 కోసం TG అందించిన రూ.4.15CRను మళ్లించి సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నారు.
News January 6, 2026
డాక్టర్‌కూ తప్పని కుల వివక్ష!

TG: కులం రక్కసికి ఓ జూనియర్ డాక్టర్ బలైపోయింది. గద్వాల జిల్లాకు చెందిన లావణ్య చిన్నప్పటి నుంచి టాపర్. సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. సికింద్రాబాద్‌కు చెందిన ప్రణయ్ తేజ్ అనే యువకుడిని ప్రేమించగా అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇటీవల కులాలు వేరని పెళ్లికి నో చెప్పడంతో ఆమె పాయిజన్ ఇంజెక్షన్ వేసుకొని సూసైడ్ చేసుకుంది. ప్రణయ్‌ను పోలీసులు అరెస్టు చేసి అట్రాసిటీ కేసు పెట్టారు.


