News December 21, 2025
గార్డెన్ రిచ్ షిప్‌బిల్డర్స్& ఇంజినీర్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

<
Similar News
News December 24, 2025
నటుడిని పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్

అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ వీనస్ విలియమ్స్, ఇటాలియన్ యాక్టర్ ఆండ్రియా ప్రెటి వివాహం చేసుకున్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో 5 రోజులపాటు వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. పెళ్లి విషయాన్ని వీనస్ SMలో వెల్లడించారు. ఈ 45 ఏళ్ల టెన్నిస్ స్టార్ 7సార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఛాంపియన్‌గా నిలిచారు. గత 16 నెలలుగా ఆటకు దూరంగా ఉన్న ఆమె JANలో ఆక్లాండ్‌లో జరిగే WTA టూర్ 33వ స్ట్రెయిట్ సీజన్‌లో పాల్గొననున్నారు.
News December 24, 2025
ఢిల్లీలో ఉంటే అలర్జీలు వస్తున్నాయి: నితిన్ గడ్కరీ

దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. “ఢిల్లీలో 3 రోజులు ఉంటేనే నాకు అలర్జీలు వస్తున్నాయి” అని అన్నారు. ఢిల్లీ-NCR (నేషనల్ క్యాపిటల్ రీజియన్) ప్రాంతంలో కాలుష్యంలో 40% రవాణా రంగం నుంచే వస్తోందని వెల్లడించారు. ఢిల్లీకి వచ్చే ప్రతిసారీ వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తానని, పొల్యూషన్ భయంకరంగా ఉందన్నారు.
News December 24, 2025
రోడ్డుపైనే సర్జరీ చేసిన డాక్టర్లు.. నెటిజన్ల ప్రశంసలు

ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాపాడేందుకు ముగ్గురు డాక్టర్లు రోడ్డుపైనే సర్జరీ చేశారు. కేరళలో జరిగిన ప్రమాదంలో లీనూ అనే వ్యక్తి గాయపడి శ్వాస ఆడక ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో వచ్చిన డా.థామస్ పీటర్, దిదేయా థామస్, మనూప్ ఫ్లాష్‌లైట్ వెలుతురులో బ్లేడ్, స్ట్రాతో సర్జరీ చేసి ఆసుపత్రికి తరలించే వరకూ ప్రాణాలను నిలబెట్టారు. లినూ చికిత్స పొందుతూ మృతి చెందినప్పటికీ వైద్యులు చేసిన పనికి ప్రశంసలు దక్కుతున్నాయి.


