News January 9, 2026

గార్డెన్ రిచ్ షిప్‌బిల్డర్స్& ఇంజినీర్స్ లిమిటెడ్‌లో 220 పోస్టులు

image

గార్డెన్ రిచ్ షిప్‌బిల్డర్స్& ఇంజినీర్స్ లిమిటెడ్‌లో 220 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఐటీఐ, గ్రాడ్యుయేట్(Engg.), డిప్లొమా ఉత్తీర్ణులు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.grse.nic.in/

Similar News

News January 29, 2026

‘కాళేశ్వరం’, ‘మిషన్ కాకతీయ’పై కేంద్రం ప్రశంసలు

image

TG: ఎకనామిక్ సర్వే-2026 నివేదికను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకాలను ఈ సర్వే రిపోర్టు ప్రశంసించింది. KCR హయాంలోని ఈ రెండింటి వల్ల TGలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగినట్లు పేర్కొంది. 1.31 కోట్ల ఎకరాల (2014) నుంచి 2.2 కోట్ల ఎకరాలకు (2023) పెరిగిందని తెలిపింది. 9 ఏళ్లలో సుమారు 90 లక్షల ఎకరాలకు ప్రభుత్వం కొత్తగా సాగునీరు అందించిందని వివరించింది.

News January 29, 2026

ఆటను ఆస్వాదించలేకపోయా.. రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్

image

తన రిటైర్మెంట్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆటను ఆస్వాదించలేకపోయా. మద్దతు, గౌరవం లభించలేదని భావించా. అలాంటప్పుడు ఎందుకు ఆడాలి, ఇంకా ఏం నిరూపించుకోవాలని అనిపించింది. మానసికంగా, శారీరకంగా ఇంతకుమించి చేయలేననే భావన ఏర్పడింది. ఇది చాలా బాధించింది. అందుకే రిటైరయ్యా’ అని సానియా మీర్జాతో ఇంటర్వ్యూలో అన్నారు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌‌కు యువీ వీడ్కోలు పలికారు.

News January 29, 2026

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>ఎయిర్‌పోర్ట్స్<<>> అథారిటీ ఆఫ్ ఇండియా 30 అసోసియేట్ కన్సల్టెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు నేటి నుంచి FEB 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్ (సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, DV, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.70,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.aai.aero