News March 1, 2025
గాలికుంటు టీకాల పోస్టర్ల ఆవిష్కరణ

జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను శనివారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమం 01/03/25 నుంచి 30/03/25 తేదీ వరకు ఉచితంగా అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు ఉన్నారు.
Similar News
News March 1, 2025
భద్రాద్రి: కనిపించిన నెలవంక.. రేపటి నుంచి రంజాన్

భద్రాద్రి జిల్లాలో రంజాన్ పవిత్ర మాసం ఆదివారం నుంచి ప్రారంభమవనుందని ముస్లిం మత పెద్దలు తెలిపారు. దేశంలోని అన్నీ ప్రాంతాల్లో నెలవంక శనివారం కనిపించడంతో రేపటి నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. కాగా, రోజా పాటించే ముస్లింలు నమాజ్‌కు మొదటి ప్రాధాన్యతనిస్తారు. నమాజ్ కోసం అన్ని మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సహర్ నుంచి ఇఫ్తార్ వరకు ఉపవాస దీక్షలు పాటిస్తారు.
News March 1, 2025
గుంటూరు జిల్లా TODAY TOP NEWS

★ గుంటూరు జిల్లా 143 కోట్ల నిధులు: కేంద్ర మంత్రి పెమ్మసాని★ ఈ రోజు నుంచి కొత్త మోటర్ యాక్ట్ అమలు: ఎస్పీ★ గుంటూరు జిల్లా పెన్షన్ల పంపిణీ★ గుంటూరు: 80 ఏళ్ల వయస్సులో మూడు బంగారు పథకాలు★ గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా మొదటి రోజు ఇంటర్ పరీక్షలు★ మంగళగిరి: వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ దంపతులు★ ఏమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్
News March 1, 2025
డ్రగ్స్‌పై పంజాబ్ యుద్ధం

మాదకద్రవ్యాలను అరికట్టడమే లక్ష్యంగా పంజాబ్ ప్రభుత్వం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇవాళ ఒక్కరోజే 12వేల మందికి పైగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 750 ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. 8 కిలోల హెరాయిన్, 16వేలకు పైగా మత్తు ట్యాబ్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 290 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. తమ పోరాటానికి పార్టీలకతీతంగా మద్దతు ఇవ్వాలని ఆప్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.