News May 10, 2024
గిద్దలూరు: ఓటుకు నోటులో ఇద్దరు అరెస్ట్

గిద్దలూరు మండలంలోని ముళ్లపాడులో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్న ఓ ప్రధాన పార్టీకి చెందిన ఇద్దరిని శుక్రవారం ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.29,500 నగదు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది వెల్లడించారు. ఓటర్లకు నగదు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News December 22, 2025
ప్రకాశం: బిడ్డ మోసానికి.. RDO న్యాయం

కన్న బిడ్డ మోసం చేస్తే.. ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న ఆ తల్లికి న్యాయం చేశారు. ముండ్లమూరు మండలం కొమ్మవరంకు చెందిన రమాదేవికి ఒక కుమారుడు ఉన్నారు. కాగా రమాదేవి పేరుమీద ఉన్న 1.96 ఎకరాల వ్యవసాయ భూమిని ఆమె మృతి చెందినట్లు తప్పుడు సర్టిఫికెట్ సృష్టించి వేరొకరికి ఆ భూమి విక్రయించాడు. రమాదేవి దీనిపై RDOకు ఫిర్యాదు చేయగా స్పందించిన ఆర్డీవో విక్రయాన్ని రద్దుచేసి సహకరించిన అధికారులపై చర్యలకు ఆదేశించారు.
News December 22, 2025
క్రిస్మస్‌కు ఒంగోలు మీదుగా స్పెషల్ ట్రైన్..!

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలుమీదుగా వేళాంగిణికి ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సోమవారం విడుదల చేసింది. సికింద్రాబాదు నుంచి వేళాంగిణికి స్పెషల్ ట్రైన్ (07407) చీరాల, ఒంగోలు మీదుగా 23వ తేదీన ప్రయాణిస్తుందన్నారు. అలాగే వేళాంగిణి నుంచి సికింద్రాబాదుకు (07408) స్పెషల్ ట్రైన్ 25వ తేదీన ఒంగోలు మీదుగా ప్రయాణిస్తుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
News December 22, 2025
ప్రకాశం: ఓపెన్‌లో టెన్త్, ఇంటర్ రాస్తున్నారా..!

ప్రకాశం జిల్లాలో ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ తేదీలను డీఈఓ రేణుక ప్రకటించారు. వచ్చే మార్చి 2 నుంచి 13 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 16 నుంచి 28 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్ష ఫీజులు తగిన అపరాధ రుసుము చెల్లించి ఈనెల 26 వరకు ఆన్లైన్‌లో చెల్లించవచ్చన్నారు. ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్స్, విద్యార్థులచo పరీక్ష ఫీజు చెల్లించేలా చేయాలన్నారు.


