News April 2, 2024
గిద్దలూరు: జనసేన పార్టీలో బయటపడ్డ వర్గ విభేదాలు

గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఆదివారం ఓవర్గం బెల్లంకొండ సాయిబాబునే తమకు ఇన్ఛార్జ్గా కావాలని అంటుండగా, సోమవారం మరో వర్గం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమంచి స్వాములును గిద్దలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ప్రకటించాలని డిమాండ్ చేసింది. జనసేనలో వర్గ విభేదాలు బయటపడటంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
Similar News
News April 21, 2025
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డీఎస్సీ ద్వారా<<16156012>> 629 పోస్టులు<<>> భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-259 ➤ BC-A:44 ➤ BC-B:58
➤ BC-C:08 ➤ BC-D:46 ➤ BC-E:25
➤ SC- గ్రేడ్1:08 ➤ SC-గ్రేడ్2:38.
➤ SC-గ్రేడ్3:48 ➤ ST:33 ➤ EWS: 61
➤ PHC-HH:1
News April 21, 2025
ప్రకాశం: పుట్టింటి నుంచి ఆలస్యంగా వచ్చిందని.!

పేర్నమిట్టలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పేర్నమెట్టకు చెందిన నవీన్.. భార్య శ్రావణి గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆమె పుట్టినిల్లు అయిన జమ్ములపాలెంకు వెళ్లింది. అదే రోజు రమ్మని నవీన్ కోరగా ఆమె మరుసటి రోజు వచ్చింది. దీంతో అనుమానం పెంచుకున్న నవీన్ ఆదివారం ఆమె గొంతు మీద కాలు పెట్టి తొక్కడంతో ఆమె మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2025
బేస్తవారిపేట: పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతి

బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లిలో విషాదం నెలకొంది. ఆదివారం క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడటంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు పెద్ద ఓబులేనిపల్లికి చెందిన ఆకాశ్, సన్నీగా గ్రామస్థులు గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.