News August 12, 2025

గిద్దలూరు: పెద్దపులి దాడిలో గేదె మృతి?

image

గిద్దలూరు మండలం వెల్లుపల్లె అటవీ ప్రాంతం సమీపంలో పొలాల్లోకి మేతకు వెళ్లిన గేదెను పులి దాడి చేసి చంపినట్లు స్థానికులు భావిస్తున్నారు. అందిన సమాచారం మేరకు.. ప్రతిరోజు వెల్లుపల్లె అటవీ ప్రాంతంలోకి పశువులు వెళ్తుంటాయి. అయితే పెద్దపులి దాడి చేసి గేదెను చంపినట్లు పశుపోషకుడు రంగస్వామి చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. గేదె విలువ రూ.80 వేలు ఉంటుందని యజమాని వాపోయాడు.

Similar News

News September 9, 2025

నేడు ప్రకాశం జిల్లాలో అన్నదాత పోరు.!

image

ప్రకాశం జిల్లాలో అన్నదాత పోరును నేడు నిర్వహిస్తున్నట్లు YCP ప్రకటించింది. యూరియా కొరత ఉందంటూ వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టనుంది. జిల్లా అధికార యంత్రాంగం మాత్రం జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులకు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఎస్పీ దామోదర్ ఆదేశాలతో ఇటీవల ఎరువుల షాపులపై విస్తృత తనిఖీలు సాగాయి. కాగా YCP నిరసనకు పిలుపునివ్వగా, 30 యాక్ట్ అమలులో ఉందని పలుచోట్ల పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

News September 9, 2025

ఒంగోలులో పోలీసులపై దాడి.. ఆ తర్వాత?

image

ఒంగోలులో వినాయక నిమజ్జనం సందర్భంగా ఆదివారం ట్రాఫిక్ పోలీసులపై పలువురు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దీనిని పోలీస్ అధికారుల సంఘం కూడా తప్పుపట్టింది. కాగా ఈ ఘటనపై ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ పోలీసులపై దాడికి పాల్పడ్డ ఆరుగురిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఇంకా ఈ ఘటన వెనుక ఎవరున్నారనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నట్లు సమాచారం.

News September 9, 2025

11న బాపట్లకు పవన్ కళ్యాణ్.!

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 11న బాపట్లకు రానున్నారు. పొరుగు జిల్లాకు పవన్ వస్తున్న నేపథ్యంలో ప్రకాశం జనసేన నేతలు కూడా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని తనయుడు ప్రణీత్ రెడ్డి ఒంగోలుకు వచ్చారు. ఆయన పవన్ మంజూరు చేసిన పలు చెక్కులను నేడు పంపిణీ చేయనున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా జనసేనలో కాస్త వివాదం తెరపైకి రాగా, పవన్ ఎలా స్పందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.