News April 16, 2025

గిరిజనులకు సదుపాయాలు కల్పించాలి: నంద్యాల కలెక్టర్

image

ప్రధానమంత్రి జన్మన్ క్రింద గిరిజన నివాసిత ప్రాంతాల్లో గుర్తించిన మౌలిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేసేలా.. చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి జన్మన్ పథకాల గుర్తించిన 11 అంశాల పురోగతిపై మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 14 మండలాల్లో 48 గిరిజన నివాసిత ప్రాంతాల్లో CM జన్మన్ కింద గుర్తించిన 11అంశాలలో పనులను పూర్తి చేయాలన్నారు.

Similar News

News July 6, 2025

MLA వరదకు సర్జరీ.. కాల్ చేసి మాట్లాడిన CM

image

ప్రొద్దుటూరు MLA వరదరాజులరెడ్డి గుండె ఓపెన్ సర్జరీ చేయించుకుని HYD ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విషయం తెలుసుకున్న CBN శనివారం వరదకు కాల్ చేసి ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలోకి రావాలంటూ ఆకాంక్షించినట్లు సమాచారం.

News July 6, 2025

సింహాచలం గిరి ప్రదక్షిణకు ట్రాఫిక్ ఆంక్షలు

image

గిరి ప్రదక్షిణ రూట్లో వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు విశాఖ సీపీ శంఖ‌బ్రత బాగ్చి తెలిపారు. 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు నిర్దేశిత ప్రాంతాలను గుర్తించామన్నారు.

News July 6, 2025

అనంతగిరిగా మార్చాలని డిమాండ్.. మీ కామెంట్ ?

image

వికారాబాద్ జిల్లాలో మరో కొత్త డిమాండ్ వినిపిస్తోంది. చుట్టూ అడవి, గుట్ట మీద అనంత పద్మనాభస్వామి కొలుదీరిన ప్రాంతానికి అనంతగిరి జిల్లాగా పేరు మార్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అనంతగిరి గుట్టల ప్రకృతి సోయగాలు, మూసీ నది జన్మస్థలం, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఎంతో ప్రసిద్ధి చెందటంతో జిల్లా పేరు మార్చాలని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిపై మీ కామెంట్.