News September 9, 2025
గిరిజనులకు సౌర గిరి జల వికాసం పథకం: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

గిరిజనులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించిందని, అర్హులైన పోడు పట్టాదారులను గుర్తించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ పథకం అమలుపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ పథకం అమలు కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో 15 మండలాల్లో పోడు భూములకు పట్టాలు అందించినట్లు తెలిపారు.
Similar News
News September 9, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నిక: ఓటేసిన ఎంపీ అర్వింద్

ఉపరాష్ట్రపతి ఎన్నికకు మంగళవారం ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో MP అర్వింద్ ధర్మపురి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ భవనంలోని ‘F-101 వసుధ’లో రహస్య బ్యాలెట్ విధానంలో ఆయన ఓటేశారు.
News September 9, 2025
NZB: చేపలు పట్టేందుకు వెళ్లి.. చెరువులో పడి మృతి

సిరికొండ మండలం కొండాపూర్ గోప్య తండా పరిధిలోని గంటతాండలో విషాదం నెలకొంది. చేపలు పట్టేందుకు చెరువుకు వెళ్లిన శంకర్ (60) చెరువులో పడి మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ చేపల వేటకు వెళ్లాడు. చాలా సేపటి వరకు తిరిగి రాకపోవడంతో వెతకగా, అతని మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 9, 2025
శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు 8 గేట్ల ద్వారా నీటి విడుదల

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 54,545 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 8 వరద గేట్ల ద్వారా 25000 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్ట్ అధికారులు దిగువకు వదులుతున్నారు. IFFC 19,000, కాకతీయ 5,500, ఎస్కేప్ 2,500, సరస్వతి 800, లక్ష్మి 200, అలీసాగర్ 360, గుత్ప 270, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని కేటాయిస్తున్నారు. ప్రాజెక్టులో 1091 అడుగులకు నీటిమట్టం చేరుకోగా 80.501 TMC నీరుంది.