News August 9, 2025
గిరిజనుల పిల్లలను పాఠశాలలకు పంపాలి: కలెక్టర్

జిల్లాలో ఉన్న చెంచుగూడాలలోని తల్లిదండ్రులు వారి పిల్లల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, వారిని పాఠశాలలకు పంపాలని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. గిరిజనుల అభ్యున్నతి కోసం భుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
Similar News
News August 9, 2025
నిర్మాతలతో కార్మిక ఫెడరేషన్ చర్చలు విఫలం

వేతనాల పెంపుపై <<17354311>>నిర్మాతలతో<<>> కార్మిక ఫెడరేషన్ చర్చలు విఫలమయ్యాయి. కార్మికులకు యూనియన్ల వారీగా పర్సెంటేజ్ విధానానికి తాము ఒప్పుకోబోమని, 30శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్‌కు వెళ్తామని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని స్పష్టం చేశారు. ఫెడరేషన్‌ను విభజించేలా నిర్మాతల ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. రేపటి నుంచి నిరసనలు ఉధృతం చేస్తామని చెప్పారు.
News August 9, 2025
సృష్టి అక్రమాలతో మాకు సంబంధం లేదు: KGH

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల్లో KGHకి ఎటువంటి సంబంధం లేదని సూపరింటెండెంట్ వాణి స్పష్టం చేశారు. ఈ అక్రమాల్లో KGH, ఆంధ్రా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్ల ప్రమేయం ఉందని మీడియా కథనాల ద్వారా తనకు తెలిసిందన్నారు. దీనిపై ఇంత వరకూ అధికారిక సమాచారం అందలేదని చెప్పారు. ప్రస్థుతం ఈ కేసుపై తెలంగాణ పోలీసులు విచారణ చేస్తున్నారని, డాక్టర్ల ప్రమేయం ఉందని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
News August 9, 2025
MBNR: HYDలో తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

తమ్ముడి ప్రాణాలు కాపాడి ఆదర్శంగా నిలిచిన అక్క కథ ఇది. MBNRకు చెందిన బాలుడు అప్లాస్టిక్ ఎనీమియా వ్యాధితో బాధపడుతూ HYDలోని KIMSలో అడ్మిట్ అయ్యాడు. మూల కణాల (Stem cells) మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పడంతో తన శరీరం నుంచి దానం చేసిన అక్క తమ్ముడికి పునర్జన్మను ప్రసాదించింది. ఆస్పత్రిలో ఉన్న తమ్ముడికి నేడు రాఖీ కట్టింది. ‘నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష’ అన్న నానుడికి ఈ సోదరి నిదర్శనం.