News March 28, 2026

గిరిజన ఉత్పత్తులకు ‘భద్రగిరి’ వెన్నుదన్ను : తుమ్మల

image

గిరిజన ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ కల్పించి, గిరిజన కుటుంబాలకు ఆర్థిక వెసలుబాటు కల్పించడమే లక్ష్యంగా భద్రగిరి మార్ట్‌‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం భద్రాచలంలో ప్రారంభమైన ఈ మార్ట్‌ను గిరిజన రైతులు, మహిళా సంఘాల అభివృద్ధికి ఒక మైలురాయిగా ఆయన అభివర్ణించారు. ITDA PO రాహుల్ చొరవతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

Similar News

News April 14, 2026

MBNR: అడుగంటిన జూరాల.. రైతుల్లో ఆందోళన!

image

ఉమ్మడి MBNRలోని జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరాయి. 9.657 TMCల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 0.44 TMCలే ఉండటంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలైంది. నీరు తగ్గడంతో శ్రీరంగాపూర్, వీపనగండ్ల మండలాల్లో పంటలు ఎండు ముఖం పట్టాయి. కాలువల్లో చెత్తా పేరుకుపోవడం మరో శాపంగా మారింది. పంట కోత దశలో ప్రభుత్వం ‘క్రాప్ హాలిడే’ ప్రకటించడంతో, 2 తడుల నీరు అందక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News April 14, 2026

అన్నమయ్య జలధార ప్రాజెక్టుపై కేంద్ర బృందం పర్యటన

image

జలధార ప్రాజెక్టుపై అధ్యయనం చేయడానికి కేంద్ర బృందం ఈనెల 16న అన్నమయ్య జిల్లాకు రానుందని కలెక్టర్ తెలిపారు. కేంద్ర భూగర్భ జల బోర్డు ఇంజనీర్లతో కూడిన ఈ బృందం 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటించి ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించనుంది. జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగా అమలు అవుతున్న జలధార ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం “జలధార -జలహారతి” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనుకుంటోందన్నారు.

News April 14, 2026

భద్రాద్రి జిల్లాలో ముగిసిన పదో తరగతి పరీక్షలు

image

జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 12,728 మంది విద్యార్థులకు గాను 12,699 మంది హాజరయ్యారని, 99.77 శాతం హాజరు నమోదైనట్లు డీఈఓ బి.నాగలక్ష్మి తెలిపారు. కేవలం 29 మంది మాత్రమే గైర్హాజరయ్యారు. చివరి రోజు కలెక్టర్‌ అంకిత్‌ పలు కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు ముగియడంతో గురుకులాలు, హాస్టళ్ల నుంచి విద్యార్థులు తమ సామగ్రితో ఇళ్లకు బయలుదేరారు.