News February 4, 2025

గిరిజన బ్యాంకులు ఏర్పాటు చేయాలని అరకు ఎంపీ వినతి

image

గిరిజన బ్యాంకులు ఏర్పాటు చేసి గిరిజన ఆర్థిక పురోగతి సాధించడానికి తోడ్పాటు ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ని మంగళవారం కలిసి వినతి పత్రం అందజేసినట్లు అరకు ఎంపీ గుమ్మ తనుజారాణి తెలిపారు. గ్రామీణ వికాస్ బ్యాంకుల తరహాలో అవి ఉండాలన్నారు. మైక్రో ఫైనాన్స్, వ్యవసాయ రుణాలు, జీవనోపాధికి మద్దతు వంటి అవసరాలు తీరుస్తాయన్నారు. గిరిజన పర్యాటక రుణాలు, పశువుల బీమా, ఆరోగ్య బీమాకల్పించాలన్నారు.

Similar News

News November 8, 2025

KTDM: ఆస్పత్రుల సేవలు భేష్.. ప్రభుత్వానికి నివేదిక

image

కొత్తగూడెం జిల్లాలోని టీవీవీపీ ఆసుపత్రుల సేవలు అద్భుతంగా ఉన్నాయని సీఆర్‌ఎం బృంద సభ్యులు డాక్టర్ జి.బి. సింగ్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు పరిశీలించిన ఇల్లందు, భద్రాచలం ఆసుపత్రులలోని వైద్య ప్రమాణాలు అత్యున్నతంగా ఉన్నాయన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ, స్పెషలిస్ట్ వైద్య సేవలు అద్భుతంగా అందుతున్నాయని, నాణ్యమైన వైద్యం అందిస్తూ ఆసుపత్రులు భేష్ అని కొనియాడారు.

News November 8, 2025

కుప్పంలో పరిశ్రమలు ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన

image

కుప్పం నియోజకవర్గంలో ఏడు పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి శనివారం సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. సుమారు రూ.2200 కోట్ల పెట్టుబడితో 22 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏడు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని అన్నారు. దీనికి సంబంధించి శనివారం అమరావతి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.

News November 8, 2025

మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

image

ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టీ20 వర్షం కారణంగా రద్దయింది. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన భారత్ 4.5 ఓవర్లలో 52 రన్స్ చేసింది. ఈ క్రమంలోనే మొదలైన వర్షం పెద్దదైంది. దీంతో ఆట సాధ్యం కాదని అంపైర్లు ప్రకటించారు. ఇప్పటికే 2-1 తేడాతో ముందంజలో ఉన్న భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి టీ20 కూడా వర్షం వల్ల రద్దు కాగా రెండో మ్యాచులో ఆసీస్.. మూడు, నాలుగో టీ20ల్లో ఇండియా గెలిచింది.