News August 13, 2025
గిరిజన మహిళపై ఎస్సై లైంగిక వేధింపులు.. వీఆర్‌కు ఎస్పీ ఆదేశం

గిరిజన మహిళపై లైంగిక వేధింపుల కేసులో ముదిగుబ్బ(M) పట్నం SI రాజశేఖర్‌ను SP రత్న VRకు పంపారు. గరుగుతండాకు చెందిన మహిళ ఓ కేసు విషయంలో SIని సంప్రదించింది. తన కోరక తీరిస్తే న్యాయం చేస్తానని, లేకుంటే ఇబ్బంది పడతావంటూ ఆమెను SI బెదించాడు. రాత్రి సమయంలో వీడియో కాల్స్ చేస్తూ ఇబ్బంది పెట్టేవాడు. ఈ విషయం SPకి చేరడంతో చర్యలకు పూనుకున్నారు. విచారణలో నిజమని తేలితే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని తెలిపారు.
Similar News
News August 13, 2025
MBNR: డిగ్రీ, PGలో అడ్మిషన్లు.. నేడే లాస్ట్

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ, పీజీలో అడ్మిషన్లకు నేడు చివరి తేదీ అని ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ Way2Newsతో తెలిపారు. రెగ్యూలర్‌గా కాలేజీకి వెళ్లి చదవలేని విద్యార్థులు, ఉద్యోగులకు ఓపెన్ యూనివర్సిటీ ఒక మంచి అవకాశం అని సూచించారు. పూర్తి వివరాలకు https://braou.ac.in వెబ్ సైట్‌ను సందర్శించాలన్నారు.
News August 13, 2025
MBNR: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై నిఘా

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. MBNR-10,904, NGKL-8,525, WNPT-6,538, GDWL-6,488, NRPT- 5,233 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 36,224 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందుకున్నారు.
News August 13, 2025
భద్రాచలం ఆలయానికి ISO గుర్తింపు

భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. 19001 ప్రమాణ స్థాయిలను పాటించేటటువంటి 22000 ఆహార భద్రత నిర్వహణ స్థాయి పాటించే గుర్తింపు లభించింది. మంత్రి కొండా సురేఖ చేతులు మీదుగా దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎల్ రమాదేవి అందుకున్నారు. ఈ సర్టిఫికెట్‌ను ఐఎస్ఓ డైరెక్టర్ శివయ్య అందించారు.