News December 29, 2025
గిల్ చాలా బద్ధకస్తుడు.. కోహ్లీలా ఆడలేడు: పనేసర్

టీమ్‌ఇండియా వన్డే & టెస్ట్ కెప్టెన్ గిల్ చాలా బద్ధకస్తుడని, కోహ్లీలా దూకుడుగా ఆడలేడని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ విమర్శించారు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేయడం అతనికి భారమని అన్నారు. టెస్టుల్లో నిలదొక్కుకోవాలంటే దేశవాళీ క్రికెట్ బలోపేతం కావాలని సూచించారు. ప్లేయర్లు కేవలం IPL కాంట్రాక్టుల కోసమే ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కోహ్లీ లేకపోవడంతో జట్టులో ఆ తీవ్రత కనిపించడం లేదన్నారు.
Similar News
News December 30, 2025
అందరికీ AI: ప్రభుత్వం సరికొత్త ప్లాన్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేవలం కొందరికే పరిమితం కాకుండా, సామాన్యులకూ అందుబాటులోకి రావాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ‘AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’పై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. నగరాలకే పరిమితం కాకుండా గ్రామాల్లోని వారూ లోకల్ భాషల్లో AI టూల్స్ తయారు చేసుకునేలా.. కంప్యూటింగ్ పవర్, డేటాను అందరికీ షేర్ చేయడమే ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం.
News December 30, 2025
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నేడు ఏం దానం చేయాలంటే?

వైకుంఠ ఏకాదశి పర్వదినాన దానాలు చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ‘దుప్పట్లు, వస్త్రాలు దానం చేయడం శ్రేష్ఠం. స్తోమత ఉంటే గోదానం చేయవచ్చు. ఇది ఎంతో పుణ్యాన్నిస్తుంది. సమాజంలో గౌరవం, ఆర్థికాభివృద్ధిని తెస్తుంది. అన్నదానం, అవసరమైన వారికి ఆర్థిక సాయం చేస్తే పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పవిత్ర రోజున స్వార్థం వీడాలని, చేసే చిన్న దానలైనా తృప్తిగా చేయాలని పండితులు చెబుతున్నారు.
News December 30, 2025
మాజీ ఎమ్మెల్యే మృతి

AP: రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి వెంకటేశ్వర ప్రసాద్ గుండెపోటుతో ఇవాళ మృతి చెందారు. అనారోగ్యంతో ఇటీవల తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు వెల్లడించారు. 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన ప్రసాద్.. 2004లో అదే పార్టీ నుంచి గెలుపొందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.


