News February 10, 2025

గీసుగొండలో గంజాయి చాక్లెట్ల కలకలం..

image

గీసుగొండ మండలంలో గంజాయి చాక్లెట్ల వార్త కలకలం రేపింది. సీఐ మహేందర్ తెలిపిన వివరాలిలా.. టెక్స్‌టైల్ పార్కులో పనిచేస్తున్న ముగ్గురు యువకుల వద్ద గంజాయి చాక్లెట్లు ఉన్నాయని సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ముగ్గురు యువకులు పారిపోవడానికి యత్నించారు. వారిని వెంబడించి పట్టుకోగా 12 గంజాయి చాక్లెట్లు లభించాయన్నారు. వారిని కస్టడీలోకి తీసుకున్నామని CI తెలిపారు.

Similar News

News February 10, 2025

హనుమకొండ: ఐనవోలులో లేగలపై హైనాల దాడి

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పరిధి గరిమెళ్లపల్లి గ్రామంలో రాత్రి హైనాలు దాడి చేసి మూగజీవాలను చంపాయి. స్థానికుల కథనం ప్రకారం.. సుమారు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గ్రామంలోకి హైనాలు చొరబడి పాకలో ఉన్న లేగలను చంపాయి. శనివారం చర్ల అజయ్ కుమార్ లేగను, ఆదివారం రాత్రి రాజారపు పోశాలు పాకలో ఉన్న లేగలపై దాడి చేసి చంపాయిని స్థానికులు తెలిపారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News February 10, 2025

వరంగల్: ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ

image

వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో పంచాయతీ రాజ్ ఏఈ ఏసీబీకి చిక్కాడు. ఇంటి నిర్మాణం కోసం వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా సమాచారంతో ఏసీబీ అధికారులు రెడ్‌‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 10, 2025

వేయి స్తంభాల ఆలయానికి 862 ఏళ్లు

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని చారిత్రక వేయి స్తంభాల ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. కాకతీయ శిల్పకళా శైలిలో రుద్ర దేవుడు ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఆలయాన్ని నిర్మించి సుమారుగా 862 ఏళ్లు అవుతుంది. ఆలయాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తూ శిల్పకళా సంపదను తిలకిస్తుంటారు. మీరు వేయి స్తంభాల ఆలయానికి వెళితే కామెంట్ చేయండి.

error: Content is protected !!