News October 27, 2024
గుంటూరుకు జాతీయ స్థాయి అవార్డు
రుణాలు అందించడంలో జాతీయ స్థాయిలో రాష్ట్రంలోని కార్పోరేషన్లలో గుంటూరు మొదటి స్థానంలో నిలిచింది. ఈనెల 29న విజయవాడలో కమిషనర్ పులి శ్రీనివాసులు అవార్డును అందుకుంటారు. చిరు వ్యాపారులకు పీఎం స్వానిధి రుణాల అందించడంలో జాతీయస్థాయిలో నగరపాలక సంస్థ అవార్డుకు ఎంపికైంది. బ్యాంకుల ద్వారా 21,594 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందించడం ద్వారా జీఎంసీ తొలి స్థానంలో నిలిచిందని కమిషనర్ వెల్లడించారు.
Similar News
News November 22, 2024
గుంటూరు: తుపాకీ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి
గుంటూరులో ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. శ్రీనివాస్ ఎస్కార్ట్ సెక్యూరిటీకి డ్యూటీ చేస్తూ ఉంటాడు. అయితే తుపాకీ మిస్ ఫైర్ అయి శ్రీనివాస్ మృతిచెందినట్లు పోలీసులు చెబుతున్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉంచారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 22, 2024
మంగళగిరి: మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు
మంత్రి నారా లోకేశ్‌ని కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వ్యక్తిపై మంగళగిరి పట్టణ పోలీసు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. గత నెల 21వ తేదీన ఐ.వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో మంత్రి లోకేశ్‌ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఐటీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కరీముల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
News November 22, 2024
గుంటూరు RRB అభ్యర్థులకు ముఖ్య గమనిక
సికింద్రాబాద్లో జరిగే RRB పరీక్షకు గుంటూరు నుంచి హాజరయ్యే అభ్యర్థులకు అన్-రిజర్వుడ్ స్పెషల్ ట్రైన్‌ను నడపనున్నారు. ఈ మేరకు గుంటూరు డీఆర్ఎం రామకృష్ణ గురువారం ప్రకటన విడుదల చేశారు. గుంటూరు- సికింద్రాబాద్ RRB స్పెషల్ ట్రైన్(07171) ఈ నెల 24, 25, 26, 28, 29 తేదీల్లో ఉదయం 8 గంటలకు బయలుదేరి మంగళగిరి, విజయవాడ మార్గంలో ప్రయాణించి సాయంత్రం 4.15కి సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలిపారు.