News January 18, 2025
గుంటూరులో ఇద్దరు డీఎస్పీలు బదిలీ

గుంటూరు వెస్ట్, సౌత్ డీఎస్పీలు జయరామ్ ప్రసాద్, మల్లికార్జునరావును ప్రభుత్వం బదిలీ చేసింది. గతేడాది బోరుగడ్డ అనిల్ కుమార్ అరండల్‌పేట స్టేషన్‌లో ఉన్నప్పుడు దిండు, దుప్పట్లు ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులను కలిసి రాచమర్యాదలు చేశారనే దానిపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇదిలా ఉంటే బదిలీతో ఖాళీ అయిన స్థానాలను భానోదయ, అరవింద్‌తో ప్రభుత్వం భర్తీ చేసింది.
Similar News
News February 22, 2026
గుంటూరు: బ్యాంకులో నగలు మాయం..!

తుళ్లూరు(M) వెంకటపాలెంలోని యూనియన్ బ్యాంక్‌లో బంగారు నగలు మాయమయ్యాయి. ఎస్సై కలగయ్య కథనం మేరకు.. ఈనెల 2న సేఫ్ లాకర్‌లో ఉంచిన 2 పౌచ్‌లలోని 328 గ్రాముల నగలు కనిపించడం లేదు. ప్రాథమిక అంతర్గత తనిఖీ, CCTV పరిశీలనలో అదే బ్రాంచ్‌కు చెందిన ఉద్యోగి సంధ్యారాణి అనుమతి లేకుండా తాళం చెవి తీసుకుని లాకర్ నుంచి పౌచ్‌లు తీసుకెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.

కాసేపట్లో గుంటూరు రానున్న సీఎం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో గుంటూరు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ బందోబస్తు చర్యలు చేపట్టింది. ఎస్పీ వకుల్ జిందాల్ బందోబస్తు ఏర్పాట్లతో పాటు హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎస్పీతో పాటు డీఎస్పీ అజీజ్, తదితరులు ఉన్నారు.