News August 24, 2025
గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే?

గుంటూరులో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.180, చికెన్ విత్ స్కిన్ కేజీ రూ.160గా విక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఈ ధరలు కొన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో చికెన్‌కి ఉన్న డిమాండ్‌ని బట్టి రూ. 20 నుంచి రూ. 30 వ్యత్యాసం ఉంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News August 24, 2025
గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ

గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ నాయకులు కూడా ఈ పదవి కోసం పోటీ పడుతుండటంతో రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. జిల్లాలో బీసీ వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ ఈ రేసులో ముందున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో పార్టీ అధిష్ఠానం ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటుందని నాయకులు భావిస్తున్నారు.
News August 24, 2025
గుంటూరులో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం నిధులు

గుంటూరు జిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించడానికి నిధులు మంజూరు చేయిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ మానస సరోవరం, ఉండవల్లి గుహలు వంటి వాటి అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. సూర్యఘర్ పథకం కింద నమోదైన లక్ష మందిలో కేవలం 3,600 మందికే పరికరాలు అమర్చారని, ఈ సమస్యలను పరిష్కరించి అందరికీ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు.
News August 24, 2025
మట్టి గణపతిని పూజించండి: కలెక్టర్ నాగలక్ష్మీ

పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరూ వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మీ పిలుపునిచ్చారు. దీని కోసం ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను మాత్రమే పూజించాలని ఆమె సూచించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆమె విడుదల చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఖాజావలి, ఇతర అధికారులు పాల్గొన్నారు.