News April 13, 2025
గుంటూరులో గ్రీవెన్స్ డే రద్దు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని గుంటూరు కలెక్టరేట్లో రేపు(సోమవారం) జరిగే గ్రీవెన్స్ డేని రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి ప్రకటన విడుదల చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉన్నందున గ్రీవెన్స్‌ను డే రద్దు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 15, 2025
WFH సర్వేలో గుంటూరు జిల్లా ‘లో స్పీడ్’

ఇంటి నుంచే ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వర్క్ ఫ్రమ్ హోం (WFH) సర్వేలో గుంటూరు జిల్లా వెనుకబడింది. జిల్లాలో మొత్తం 11.25 లక్షల మందిలో ఇప్పటి వరకు కేవలం 6.20 లక్షల మందిపైనే సర్వే పూర్తైంది. ఇంకా 5 లక్షల మందికి పైగా సర్వే పెండింగ్‌లో ఉంది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల ప్రజలను సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్వే వేగంగా పూర్తిచేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
News April 15, 2025
అమరావతి నిర్మాణం కోసం 44,676 ఎకరాల భూ సేకరణ

అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం మరోసారి భారీ భూసేకరణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల నుంచి మొత్తం 44,676.647 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించనున్నట్లు తెలుస్తోంది. తుళ్లూరు మండలంలో 16,407 ఎకరాలు, అమరావతి 7,306 ఎకరాలు, తాడికొండ 16,469ఎకరాలు, మంగళగిరి మండలంలో 4,492ఎకరాలు సేకరించనున్నట్లు సమాచారం. దీనిపై మీ COMMENT.
News April 15, 2025
తెనాలి: కుమార్తెపై తండ్రి లైంగిక దాడికి యత్నం

గుంటూరు (D) తెనాలి మండలం గుడివాడలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. SI ఆనంద్ తెలిపిన వివరాల మేరకు.. 40 ఏళ్ల వ్యక్తికి 15 సంవత్సరాల క్రితం వివాహమై, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. ఆదివారం తెల్లవారు జామున ఓ కుమార్తెపై లైంగిక దాడికి యత్నించాడు. గమనించిన భార్య వెంటనే కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. భార్య ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో, BNS చట్టం కింద కేసులు నమోదు చేశారు.