News December 26, 2025

గుంటూరులో ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

image

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకిరెడ్డిపాలెం హైవేలో శుక్రవారం ఉదయం ఘోరప్రమాదం జరిగింది. తెలంగాణలోని సూర్యాపేట వాసులు తిరుపతికి వెళ్లొచ్చే క్రమంలో కారును అంకిరెడ్డిపాలెం టయోటా షోరూమ్ దగ్గర ఆపారు. ఈ క్రమంలో వారి కారును ప్రైవేట్ బస్సు ఢీకొట్టగా సుశీల(64), వెంకయ్య(70), మహేశ్(28) ఘటనా స్థలంలోనే మృతిచెందారు. మృతదేహాలను పోలీసులు బయటకు తీసి మార్చురీకి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 27, 2025

జిల్లాలో ఖాళీల ఖిల్లా.. పండుగ వేళ పోలీసులకు సవాల్!

image

తూర్పుగోదావరి జిల్లాలో పండుగ వేళ శాంతిభద్రతల పరిరక్షణ సవాల్‌గా మారింది. కీలకమైన ఏఎస్పీ, డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉండటం విధి నిర్వహణపై ప్రభావం చూపుతోంది. రాజమండ్రిలో ముగ్గురు ఏఎస్పీలకు గాను ఎవరూ అందుబాటులో లేరు. ట్రాఫిక్, మహిళా పీఎస్, సెంట్రల్ డీఎస్పీ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల వేళ సిబ్బంది కొరత పోలీసు శాఖను వేధిస్తోంది.

News December 27, 2025

GNT: కార్డన్ అండ్ సెర్చ్.. గంజాయి విక్రేతలపై ఉక్కుపాదం

image

గుంటూరు జిల్లాలో నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో మంగళగిరి, ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పాత గుంటూరు, సౌత్ డీఎస్పీ భానోదయ నేతృత్వంలో నల్లపాడు పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 12 మంది రౌడీ షీటర్లు, 7 మంది సస్పెక్ట్ షీటర్లు, 7 మంది గంజాయి విక్రేతలకు కౌన్సిలింగ్ నిర్వహించి, సరైన పత్రాలు లేని 149 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలను సీజ్ చేశారు.

News December 27, 2025

KNR: మహిళలపై ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలుసా..?

image

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో మహిళలపై 567 కేసులు నమోదయ్యాయి. ఇందులో వరకట్న హత్యలు, మరణాలు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధింపులు, అత్యాచారం, అపహరణ, లైంగిక వేధింపులు, బహుభార్యత్వం కేసులు ఉన్నాయి. 2024లో 598 కేసులు నమోదు కాగా గత సంవత్సరం కంటే 5.18% మహిళల కేసులు తగ్గాయని సీపీ గౌస్ ఆలం తెలిపారు.