News March 21, 2024
గుంటూరులో టీడీపీ, వైసీపీ శ్రేణులపై కేసు నమోదు

గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ, వైసీపీ శ్రేణులపై బుధవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నరేష్ వివరాలు మేరకు.. ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ ఇంటి వద్ద వాలంటీర్లతో సమావేశం నిర్వహిస్తున్నారని నిర్ధారించుకోవడానికి టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘటనలపై 2 పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Similar News
News April 2, 2025
బస్సుల అనుమతులకు రిమార్కులు అందించండి- కలెక్టర్

రవాణా శాఖ అధికారులతో గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. గుంటూరులో ప్రైవేటు సిటీ బస్సుల రూట్ల అనుమతులకు సంబంధించి సమావేశం నిర్వహించినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టర్, ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. సిటీ బస్సుల అనుమతులకు సంబంధించి ఆర్టీసీ అధికారులు ఏప్రిల్ 9 నాటికి రిమార్కులు అందించాలని ఆదేశించారు. అనంతరం అనుమతుల మంజూరుకు ఆర్‌టీఏ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు.
News April 2, 2025
తాడేపల్లిలో వైఎస్ జగన్ కీలక సమావేశం

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశానికి వివిధ జిల్లాల నేతలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన వారిని అభినందించిన జగన్, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రజల్లో కొనసాగాలని నేతలకు సూచించారు.
News April 2, 2025
వెలగపూడిలో తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం సమీక్ష

తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం నారా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ఈ సమీక్షకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హాజరయ్యారు. సమావేశంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆలయ భద్రత, దర్శన వ్యవస్థలో మార్పులు, భక్తుల వసతి ఏర్పాట్లు వంటి అంశాలపై సీఎం చర్చించారు.