News December 7, 2024

గుంటూరులో థాయ్‌లాండ్ అమ్మాయిలతో వ్యభిచారం.!

image

గుంటూరు లక్ష్మీపురంలోని స్పా సెంటర్‌లో జరుగుతున్న వ్యభిచార గుట్టు పోలీసులు రట్టు చేసిన విషయం తెలిసిందే. వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందడంతో ఒకే సారి 17 సెంటర్లపై ఏఎస్పీ సుప్రజ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో థాయ్ లాండ్‌కి చెందిన నలుగురు, నార్త్ ఇండియాకి చెందిన ముగ్గురు, మరో స్పా సెంటర్‌లో ఏడుగురు యువతులు, ముగ్గురు విటులు, ఆయా సెంటర్ల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామన్నారు.

Similar News

News February 26, 2026

జిల్లాలో 20 కేంద్రాల్లో NEETపరీక్షలు: GNT కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో 20 కేంద్రాల్లో NEETపరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. మే 3న నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో గుంటూరు, తెనాలి, మంగళగిరి, అమరావతిలో 20 కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. గురువారం న్యూ ఢిల్లీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు.

News February 26, 2026

సమర్థవంతంగా మ్యూటేషన్ చేయాలి: కలెక్టర్

image

తప్పులు లేని మ్యుటేషన్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. రెవెన్యూ అధికారుల సమావేశం గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మ్యుటేషన్ ఒకటికి రెండు సార్లు పరిశీలించి చేయాలన్నారు. మ్యుటేషన్ అనే అంశం రెవెన్యూ శాఖకు ప్రాథమిక విధి అన్నారు. ఎటువంటి తప్పులు దొర్లినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.

News February 26, 2026

డోలిమోతల నడుమ ప్రసవించడం బాధాకరం: రాయపాటి శైలజ

image

అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని మల్లిపాడు గ్రామానికి చెందిన సుమిత్ర డోలిమోతల నడుమ టార్చి లైట్ వెలుగుల్లో ప్రసవించడం బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. గిరిజన గర్భిణీలను ప్రసవానికి 15 రోజుల ముందే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చి వైద్యుల పర్యవేక్షణలో సుఖ ప్రసవా జరిగే కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు.