News February 18, 2025
గుంటూరులో పడిపోయిన చికెన్ ధరలు

బర్డ్ ఫ్లూ ప్రభావంతో గుంటూరు నగరంలో కూడా చికెన్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజుల క్రితం ఇతర జిల్లాలతో పోల్చుకుంటే గుంటూరు నగరంలో రూ.25 ఎక్కువగా విక్రయించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రజలు మటన్, చేపల కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండటంతో చికెన్ విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో గుంటూరు చికెన్ వ్యాపార దుకాణాల సంఘ సభ్యులు కేజీ రూ. 100కి విక్రయించాలని నిర్ణయించారు.
Similar News
News July 9, 2025
గుంటూరులో స్పర్శ్ సీఎస్సీ శిక్షణ ప్రారంభం

గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయంలో బుధవారం నుంచి నాలుగు రోజుల స్పర్శ్ సీఎస్సీ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. 5 జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులకు రెండు రోజుల థియరీ, రెండు రోజుల ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారని మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస వరప్రసాద్ తెలిపారు. జులై 10, 11వ తేదీల్లో గుంటూరు, పరిసరాల మాజీ సైనికుల సమస్యలకు పరిష్కారం కల్పించనున్నట్టు చెప్పారు.
News July 9, 2025
GNT: తురకపాలెం రోడ్డులో వ్యక్తి దారుణ హత్య

నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలోని తురకపాలెం రోడ్డులో కరిముల్లా హత్యకు గురయ్యాడు. స్తంభాలగరువుకు చెందిన నివాసిగా పోలీసులు నిర్థారించారు. కరిముల్లా అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు రెండ్రోజుల క్రితం పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన వ్యక్తి శవంగా మారడంతో కుటుంబ సభ్యులు మధురెడ్డి అనే వ్యక్తి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News July 9, 2025
విదేశీ వైద్య విద్య పట్టభద్రుల సమస్యలు పరిష్కరించండి: CPI

విదేశీ వైద్య విద్య పట్టభద్రుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం చంద్రబాబును కలిశారు. ఏపీ వైద్య మండలి శాశ్వత రిజిస్ట్రేషన్ నిరాకరణపై చర్యలు తీసుకోవాలని వినతి ఇచ్చారు. హోంగార్డుల జీతాల పెంపు, బదిలీలు, కోటా అమలుపై కూడా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సీఎం సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని రామకృష్ణ తెలిపారు.