News September 25, 2025

గుంటూరులో పానీపూరీ బంద్

image

గుంటూరులోని ప్రగతి నగర్, రామిరెడ్డి తోట, రెడ్ల బజార్, సంగడిగుంట సహా 9 ప్రాంతాల్లో డయేరియా వ్యాప్తి చెందడంతో గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ అప్రమత్తమయ్యారు. కమిషనర్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పారిశుద్ధ్యం, మంచినీటి సౌకర్యంపై జాగ్రత్తలు సూచించారు. వ్యాధి మరింత ప్రబలకుండా తక్షణ చర్యగా నగరంలో పానీపూరీ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.

Similar News

News September 27, 2025

GNT: హైకోర్టు ఆదేశాలను స్వాగతించిన జగన్

image

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త కుంచాల సౌందరరడ్డి కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు సుమోటోగా ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్ అన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తుందని విమర్శించారు. అక్రమ కేసులు, అరెస్టులు, సెక్షన్ 111ని దుర్వినియోగం చేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. X వేదికగా జగన్ మాట్లాడారు.

News September 27, 2025

GNT: సౌందరరెడ్డి కేసు విచారణ వాయిదా

image

వైసీపీ వాలంటీర్స్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సౌందరరెడ్డి కేసు విచారణను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘనందన్, టీసీడీ శేఖర్ ధర్మాసనం అక్టోబర్ 13కు వాయిదా వేసింది. పోలీసులు చట్టవిరుద్దమైన చర్యలను కప్పిపుచ్చుకునే క్రమంలోనే సౌందరరెడ్డిపై గంజాయి కేసు నమోదు చేసినట్లు భావిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలోనే విచారణ చేసి పూర్తి నివేదికను ఇవ్వాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీచేసింది.

News September 27, 2025

తుళ్లూరు: 97 మందికి రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు

image

అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం(ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామాల రైతులకు శుక్రవారం విజయవాడలోని CRDA కార్యాలయంలో ఈ- లాటరీ విధానంలో 97 రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 41 నివాస ప్లాట్లు కాగా 36 వాణిజ్య ప్లాట్లు, 20 ప్రత్యామ్నాయ ప్లాట్లు మొత్తం 56 మంది రైతులు, భూయజమానులకు ప్లాట్లను కేటాయించడం జరిగిందన్నారు. CRDA స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులున్నారు.