News March 2, 2025
గుంటూరులో పెరిగిన చికెన్ ధరలు

బర్డ్ ఫ్లూ వదంతుల నేపథ్యంలో రెండు వారాలు గుంటూరులో రూ.100 కి అమ్ముడైన చికెన్ ధర పుంజుకుంది. స్కిన్ రూ.130, స్కిన్ లెస్ రూ.150, కాల్చింది రూ.140గా విక్రయిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలు మాంసంపై ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి. ఇక మటన్ విషయానికి వస్తే రూ.950 నుంచి రూ.1,000 వరకు విక్రయాలు జరుగుతున్నాయి.
Similar News
News March 3, 2025
GNT: అమ్మవారి అనుగ్రహం పేరిట మోసం

పూజల పేరిట డబ్బులు వసూలు చేసిన ఘటన GNTలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రాజేశ్వరరావు కాలనీకి చెందిన నాగేశ్వరరావుకు ఇంట్లో అమ్మవారి అనుగ్రహం ఉందని, పూజలు చేస్తే పైసలు వస్తాయని వెంకాయమ్మ అనే మహిళ నమ్మించింది. సిద్ధాంతితో ప్రాణగండం ఉందని చెప్పి భయపెట్టింది. పూజల కోసం విడతల వారీగా రూ. 15 లక్షలు తీసుకుంది. ఫలితం లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
News March 3, 2025
గుంటూరు: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ మేరకు గుంటూరు మీదుగా చర్లపల్లి(CHZ), కాకినాడ టౌన్(CCT) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈనెల 7,14, 21, 28న CHZ-CCT(నం.07031), ఈ నెల 2,9,16, 23న CCT- CHZ(నం.07032) రైళ్లు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలోని గుంటూరుతో పాటు సత్తెనపల్లి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం,రాజమండ్రి, సామర్లకోటలో ఆగుతాయని వారు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
News March 3, 2025
తెనాలి: అలర్ట్..ఆ రైళ్ల నంబర్లు మారాయి

తెనాలి, నిడుబ్రోలు మీదుగా ప్రయాణించే 2 రైళ్లకు మార్చి 1 నుంచి నూతన నంబర్లు కేటాయించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు విశాఖపట్నం-కడప మధ్య ప్రయాణించే తిరుమల(డైలీ) ఎక్స్‌ప్రెస్‌లకు పాత నంబర్లు 17487/17488 స్థానంలో 18522/18521 నంబర్లు కేటాయించామన్నారు. ప్రయాణికులు రైలు నంబర్లలో మార్పును గమనించాలని కోరుతూ తాజాగా ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.