News August 27, 2025

గుంటూరులో బార్ షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు

image

గుంటూరు జిల్లాలో బార్ షాపుల కేటాయింపుకు సంబంధించి దరఖాస్తుల సమర్పణ గడువును అధికారులు మరోసారి పొడిగించారు. ఈ నెల 26 నుంచి 29 వరకు సాయంత్రం 6 గంటల లోపు ఆసక్తిగల వారు అప్లై చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ డీసీ కె.శ్రీనివాసులు మంగళవారం వెల్లడించారు. అనంతరం 30న కలెక్టర్ కార్యాలయంలో లాటరీ నిర్వహించి మొత్తం 110 షాపుల కేటాయింపును పూర్తిచేయనున్నట్లు తెలిపారు.

Similar News

News August 27, 2025

గుంటూరు DSC అభ్యర్థులకు ముఖ్య గమనిక

image

గుంటూరు AC కళాశాలలో గురువారం DSC సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. జిల్లా విద్యాధికారిణి రేణుక వివరాల మేరకు.. అభ్యర్థులు తమ DSC లాగిన్ ద్వారా కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్లను ముందుగా అప్‌లోడ్ చేసి, తర్వాతే పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. సంబంధిత ఒరిజినల్స్‌తో పాటు, మూడు సెట్ల అటెస్టెడ్ కాపీలు, 5 పాస్‌పోర్ట్ ఫొటోలు, కుల, వికలాంగ ధృవపత్రాలను తీసుకురావాలన్నారు.

News August 27, 2025

అమరావతి ORRకు భూసేకరణ ప్రారంభం

image

వట్టిచెరుకూరు, చేబ్రోలు సమీప గ్రామాలలో అమరావతి ORR భూసేకరణ ప్రారంభమైంది. కేంద్రం ఆమోదంతో వెడల్పు 70 మీటర్ల నుంచి 140 మీటర్లకు పెరిగింది. ఇది అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలిలను రెండు లింక్ రోడ్లతో కలుపుతుంది. అమరావతికి వడ్డాణంలా ఈ రింగ్ రోడ్డు ఏర్పడనుంది. ఓఆర్‌ఆర్‌ నిర్మాణ వ్యయం మొత్తం రూ.16,310 కోట్లుగా అంచనా వేశారు.

News August 27, 2025

తెనాలి: సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రాకు అరుదైన గౌరవం

image

తెనాలికి చెందిన సినీ మాటల రచయిత, నంది అవార్డు గ్రహీత సాయి మాధవ్ బుర్రా ‘సినీ సంభాషణా శిల్పి’ బిరుదును పొందారు. అమెరికాలోని డల్లాస్‌లో ఈ నెల 24న తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతినిధులు సాయి మాధవ్ కు ఈ బిరుదు ప్రదానం చేసి సత్కరించారు. తెనాలిలో కళాకారుల కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనంలోనే రంగస్థలం నటుడిగా గుర్తింపు పొందారు. RRR సహా పలు సినిమాలకు సంభాషణలు రాసిన సాయి మాధవ్ నంది అవార్డులు కూడా పొందారు.