News August 22, 2024

గుంటూరులో బాలికపై అత్యాచారం

image

బాలికపై అత్యాచారం జరిగినట్లు అరండల్ పేట పీఎస్ లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బొంగరాలబీడుకు చెందిన 16 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. రెండేళ్లుగా ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. మాయమాటలు చెప్పి ఆ బాలికకు దగ్గరై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక తండ్రికి తెలియజేసింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 22, 2026

అమరావతిలో R-5 జోన్ రద్దు చేస్తూ నిర్ణయం

image

అమరావతిలో R-5 జోన్ రద్దు చేస్తూ CRDA నిర్ణయం తీసుకుంది. 900 ఎకరాల భూమిని తిరిగి CRDAకు అప్పగించాలని, R-5 జోన్‌లో గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లు, భూ పంపిణీని CRDA రద్దు చేసింది. R-5 జోన్‌తో అమరావతి మాస్టర్ ప్లాన్‌కు ఇబ్బంది కలుగుతుందని CRDA భావిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. R-5 జోన్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి వేరే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరుకు సిద్దమవుతుంది.

News February 22, 2026

GNT: కాంగ్రెస్ తీరుపై అంబటి తీవ్ర విమర్శలు

image

YSR మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వేధించిందని అంబటి రాంబాబు విమర్శించారు. రాజకీయ కక్షతోనే జగన్‌పై CBI, EDఅక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు YSRవారసత్వం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయ ప్రయోజనాల విషయంలో తామెప్పుడూ రాజీపడలేదన్నారు. విదేశీ గడ్డపై దేశ పరువు తీయడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబుతో కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు అందరికీ తెలుసన్నారు.

News February 22, 2026

నేడు గుంటూరుకు CMచంద్రబాబు రాక

image

గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బొమ్మిడాలనగర్‌లోని సత్యసాయి స్పిరిచ్యువల్ సొసైటీలో ఆదివారం ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అతిథులు తపాలా సేవా మూర్తులకు సన్మానం చేయనున్నారు.