News April 7, 2024
గుంటూరులో బెల్లంకొండ యువతి మృతి

గుంటూరు పట్టణంలో ఓ ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తున్న బెల్లంకొండ మండలానికి చెందిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు యువతికి తల్లిదండ్రులు లేరని ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తూ జీవనం సాగిస్తుందన్నారు. ఆదివారం యువతి నిస్సహాయ స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
Similar News
News October 4, 2025
ఖరీఫ్‌లో 50 వేల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం: జేసీ

ఖరీఫ్ సీజన్ 2025-26లో 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు జేసీ అశుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్సీ హాలులో జరిగిన జిల్లా ధాన్య సేకరణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 3,89,849 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉందన్నారు. ఇప్పటికే, డిసెంబర్ 2025 నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వివరించారు.
News October 4, 2025
కాలుష్య నివారణ చర్యలు వేగవంతం చేయాలి: కలెక్టర్

గుంటూరు GMC పరిధిలో గాలి నాణ్యత ప్రమాణాలు మెరుగుపరచడానికి కాలుష్య నివారణ చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ VC హాలులో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ద్వారా GMC పరిధిలో చేపడుతున్న పనుల పురోగతిపై జిల్లాస్థాయి అమలు కమిటీ సమావేశం జరిగింది. కాలుష్య నివారణ, రహదారుల అభివృద్ధి, మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
News October 3, 2025
గుంటూరులో ‘పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ డే’లో ఎస్పీ

SP వకుల్ జిందాల్ పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ‘పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ డే’లో పాల్గొన్నారు. ఐదుగురు పోలీస్ సిబ్బంది తమ బదిలీ, సర్వీస్ సంబంధిత సమస్యలపై వినతి పత్రాలను SPకి సమర్పించారు. SP వాటిని సానుకూలంగా స్వీకరించి, సంబంధిత అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి, వారి వినతుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని SP పేర్కొన్నారు.