News August 29, 2025

గుంటూరులో భారీ వర్షాలు.. సగటు 40.6 మి.మీ.

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం వరకు అత్యధికంగా దుగ్గిరాలలో 58.6 మి.మీ, కనిష్టంగా మేడికొండూరులో 15.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. పెదకాకానిలో 57, చేబ్రోలు 48.4, ప్రత్తిపాడు 48.2, గుంటూరు పశ్చిమ 46.2, తాడేపల్లి 45.6 మి.మీ. వర్షం కురిసింది. పొన్నూరులో 22.6 మి.మీ. నమోదు. జిల్లాలో ఇప్పటి వరకు 276.8 మి.మీ. వర్షపాతం నమోదై సాధారణాన్ని మించిపోయింది.

Similar News

News August 29, 2025

గుంటూరులో ఈనెల 30న ఉద్యోగ మేళా

image

గుంటూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 30న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సంజీవరావు తెలిపారు. లక్ష్మీపురం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సమీపంలోని పాంటలూన్స్ షోరూంలో ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఐటీఐ, ఫార్మసీ, పీజీ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 35 సంవత్సరాల లోపు వారు ఈ మేళాలో పాల్గొనవచ్చు.

News August 29, 2025

GNT: నేడు డీఎస్సీ అభ్యర్థులకు మెడికల్ బోర్డు పరీక్ష

image

మెగా డీఎస్సీ-2025 ధృవపత్రాల పరిశీలనకు వచ్చిన విభిన్న ప్రతిభావంతులు మెడికల్ బోర్డు పరీక్షకు హాజరు కావాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి. రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పరీక్ష జరుగుతుందని ఆమె చెప్పారు. సామర్థ్య పరీక్ష నిమిత్తం ఒక్కో అభ్యర్థి ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.1,500 చెల్లించాల్సి ఉంటుందని ఆమె వివరించారు.

News August 28, 2025

గుంటూరు జిల్లా TOP NEWS TODAY

image

☞ లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన అధికారి
☞ ఐకానిక్ టవర్ల నుంచి నీరు తోడివేత 
☞ గుంటూరు: రైల్వే ట్రాక్ పై మృతదేహం లభ్యం
☞ చిలకలూరిపేటలో అమెరికన్ డైమండ్స్‌తో వినాయక విగ్రహం
☞ పులిచింతల వద్ద కొనసాగుతున్న వరద ప్రవాహం
☞ మిస్సింగ్ కేసులను ఛేదించాలి: ఎస్పీ
☞ ఈవీఎంల భద్రత పక్కాగా ఉండాలి : కలెక్టర్
☞ అంబటి మురళీ ధూళిపాళ్లపై బురద జలుతున్నారు
☞ మంగళగిరిలో ఫోన్ దొంగల అరెస్ట్