News February 6, 2025
గుంటూరులో మహేశ్ బాబు ఓటు తొలగింపు

ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుంటూరు పట్టణ పరిధిలో ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు పేరుతో ఓటర్ జాబితాలో ఓటు నమోదైన విషయం తెలిసిందే. కాగా ఆయన పేరుతో ఓటు తప్పుగా నమోదు అయిందని GMC అడిషనల్ కమిషనర్ ఓబులేసు తెలిపారు. ఫారం-7 విచారణ అనంతరం ఓటు హక్కును తొలగించినట్లు ఆయన చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News October 22, 2025
పథకాలు, కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించండి: కలెక్టర్

వ్యవసాయ, అనుబంధ రంగాలలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలపై రైతులకు శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లో వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేసి, నూతన సాంకేతికతను తెలియజేయాలన్నారు. శిక్షణా కార్యక్రమాలకు ఆత్మ పీడీ నోడల్ అధికారిగా ఉండాలన్నారు.
News October 22, 2025
సంగారెడ్డి: ‘న్యాయవాదుల సంక్షేమానికి కృషి’

న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. నూతన గౌరవాధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణువర్ధన్ రెడ్డిని సంగారెడ్డి అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సన్మానించారు. ఉపాధ్యక్షుడు భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేష్, కార్యవర్గ సభ్యులు మల్లేశం, శ్రీకాంత్, శ్రీనివాస్, మంజుల రెడ్డి, బుచ్చయ్య, సుభాష్ చందర్, నరసింహ, మాణిక్ రెడ్డి పాల్గొన్నారు.
News October 22, 2025
యాదవుల ఖదర్.. హైదరాబాద్ సదర్

సదర్.. సిటీలో జరిగే యూనిక్ ఫెస్టివల్. తమిళనాడు జల్లికట్టు వలే సదర్ ఫేమస్. నిజాం నుంచే ఇది మొదలైంది. నాడు పెద్దలను ఉర్దూలో సదర్ అనేవారు. ఇలా పెద్దల సమ్మేళనం ‘సదర్ సమ్మేళన్’గా మారింది. పాడి రైతులు, యాదవులు ఇష్టంగా పెంచుకున్న పశువులకు పూజలు చేయడం ఆనవాయితీగా వచ్చింది. పెద్ద సదర్‌లో ప్రదర్శించే దున్నరాజులు అత్యంత బలమైనవి. వాటితోనే HYD యువత విన్యాసాలు చేయడం సదర్‌కు మరింత ప్రఖ్యాతిని తెచ్చి పెట్టాయి.